గ్రామాల్లో కోతుల బెడద: గాయపడిన వృద్ధురాలు

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రామాలలో కోతుల బెడద ఎక్కువైంది. వనంలో ఉండాల్సిన కోతులు గ్రామాల్లో జన నివాసాలలో చేరి ఇండ్లలోకి దూరి స్వైర విహారం చేస్తూ పంట చేనులో వేసుకున్న పంటలను నాశనం చేస్తున్నాయని అలాగే గ్రామాల్లోని ఇండ్ల పైకి వచ్చి ఇంటి పైకప్పు చెదరగొట్టి పెంకులు ఊడదీస్తున్నాయన్నారు. అలాగే ఇండ్లలో నివస్తున్న వారిని బెదిరిస్తున్నాయని లేదంటే కరుస్తున్నాయని గ్రామస్థులు ఆవేధన చెందుతున్నారు. కోతులు ఇండ్లలోకి చేరి తినుబండారాలతో పాటు సామాన్లు ఎత్తుకు […] The post గ్రామాల్లో కోతుల బెడద: గాయపడిన వృద్ధురాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రామాలలో కోతుల బెడద ఎక్కువైంది. వనంలో ఉండాల్సిన కోతులు గ్రామాల్లో జన నివాసాలలో చేరి ఇండ్లలోకి దూరి స్వైర విహారం చేస్తూ పంట చేనులో వేసుకున్న పంటలను నాశనం చేస్తున్నాయని అలాగే గ్రామాల్లోని ఇండ్ల పైకి వచ్చి ఇంటి పైకప్పు చెదరగొట్టి పెంకులు ఊడదీస్తున్నాయన్నారు. అలాగే ఇండ్లలో నివస్తున్న వారిని బెదిరిస్తున్నాయని లేదంటే కరుస్తున్నాయని గ్రామస్థులు ఆవేధన చెందుతున్నారు. కోతులు ఇండ్లలోకి చేరి తినుబండారాలతో పాటు సామాన్లు ఎత్తుకు వెళ్తున్నాయని దీంతో చాలా ఇబ్బందికి ఏర్పడుతుందని గ్రామంలోని మహిళలు ఆవేధనకు గురవుతున్నారు. మండలంలోని కూరిక్యాల గ్రామంలో గురువారం నాడు ఇంటి ఆరు బయట కూర్చున్న నర్సమ్మ అనే వృద్ధురాలి కాలుపై కోతులు గాయాలు  చేసినాయి. కోతుల బెడద సమస్యకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు తీసుకొని అరికట్టాలని ఈ కోతుల బెడద నివారణకు గ్రామ సర్పంచులు లేదా ప్రభుత్వం గానీ మమ్మల్ని మా పంటల్ని, ఇండ్లను రక్షించాలని గ్రామాల్లోని రైతులు కోరుకుంటున్నారు.

Villagers Facing Problems With Monkeys

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గ్రామాల్లో కోతుల బెడద: గాయపడిన వృద్ధురాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: