మానవత్వం చచ్చిపోలేదు!

  నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నాను. దారిలో ఒక కరెంటు స్తంభానికి ఒక కాగితం కట్టి ఉంది. ‘దయచేసి చదవండి’ అని రాసి ఉంది. ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను. ‘ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను. నాకు కళ్ళు సరిగా కనబడవు. మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెచ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి’ అని రాసి ఉంది. నాకు ఎందుకో […] The post మానవత్వం చచ్చిపోలేదు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నాను. దారిలో ఒక కరెంటు స్తంభానికి ఒక కాగితం కట్టి ఉంది. ‘దయచేసి చదవండి’ అని రాసి ఉంది. ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను. ‘ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను. నాకు కళ్ళు సరిగా కనబడవు. మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెచ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి’ అని రాసి ఉంది.
నాకు ఎందుకో ఆ ఎడ్రెస్ ఉన్న చోటుకు వెళ్ళాలి అనిపించింది. అడ్రెస్ గుర్తుపెట్టుకున్నాను. అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక దగ్గరకు వెళ్లి పిలిస్తే పాకలో నుండి ఒక వృద్ధురాలు వచ్చింది. ఆమెకు కళ్ళు సరిగా కనబడటం లేదు. ఆ పాకలో ఆమె ఒక్కర్తే ఉంటోంది అని అర్ధం అయ్యింది. చేతి కర్ర సహాయంతో తడుముకుంటూ బయటకు వచ్చింది.
‘ఏమీ లేదమ్మా ! నువ్వు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు కనబడింది. అది ఇచ్చి పోదామని వచ్చాను’ అన్నాను.
ఆమె ఏడుస్తోంది.
‘బాబూ! ఇప్పటికి ఇలా దాదాపు 50, 60 మంది వచ్చి ఒక్కొక్కరూ ఒక 50 రూపాయలు ఇస్తున్నారు. నాకు కళ్ళు కనబడవు. నాకు చదవడం రాయడం రాదు. నేను అది రాయలేదు బాబూ ! ఎవరో నాకు సహాయం చెయ్యాలి అనిపించి అలా రాశారేమో !’
‘పోన్లే అమ్మా ఇదిగో ఈ యాభై నోటు తీసుకో !’
‘బాబూ ! అది నేను రాయలేదు. నా ఇబ్బంది చూసి ఎవరో మహానుభావుడు ఇలా రాసిపెట్టి ఉంటాడు. వెళ్ళేటపుడు అది కాస్త చించెయ్యి బాబూ !’ అంది.
ఆమె ఇలాగే అందరికీ చెప్పి ఉంటుంది. ఒక్కరూ చించెయ్యలేదు. ఆమె రాయలేదు. ఎవరో ఆమెకు సహాయపడటం కోసం ఇలా రాశారు.
ఆ రోడ్డున వెళుతున్న ఎందరిలోనో కొందరు అది చూస్తారు. అలా చూసిన ఎందరిలోనో కొందరు ఆమెకు సహాయపడాలని అనుకుంటారు. అలా అనుకున్న ఎందరిలోనో కొందరు ఆమె ఇంటికి వచ్చి ఆమెకు సహాయ పడతారు. నేను అది చించేస్తే ఆమెకు అలాంటి సహాయం దూరం చేసిన వాడిని అవుతాను … ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు. అది చింపెయ్యనా? ఉంచెయ్యనా? నాకు చెప్పినట్టే ఇంతకు ముందు వాళ్లకు కూడా చెప్పి ఉంటుంది కదా ! వాళ్ళెవరూ చింపెయ్యలేదు. అంటే అందరూ ఆమెకు ఈ రకంగా సహాయం అందాలి అని కోరుకుంటున్నారు. మరి నేను ఎందుకు అది చింపెయ్యడం ఇలా అనుకుంటూ వస్తున్నాను. ఒకాయన చేతిలో చిన్న కాగితం పట్టుకుని ఎదురుపడ్డాడు.
‘సర్ ! ఈ ఎడ్రెస్ చెప్పగలరా? నాకు ఒక 50 నోటు దొరికింది. వాళ్లకి ఇచ్చేద్దామని అడుగుతున్నాను ఆమె ఎడ్రెస్
నాకు అనిపించింది ‘మానవత్వం చచ్చిపోలేదు’. అది రాసిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఎవరికయినా సహాయం చెయ్యాలి అంటే ఎన్నో మార్గాలు. ఈ మార్గం ఎంచుకున్న వ్యక్తిని మనసులోనే అభినందించాను. ఒంటరిగా నివసిస్తున్న ఆమెకు ఇది ఒక ఊరట కలిగిస్తుంది అనడంలో నాకు సందేహం లేదు. అది చింపడం భావ్యం కాదు అనిపించింది.. నేను అది చింపేయాలా ? అలా వదిలేయాలా ? వదిలేశాను..

village igformation in telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మానవత్వం చచ్చిపోలేదు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: