చిల్లర వేషాలు వేస్తున్న చంద్రబాబు : విజయసాయిరెడ్డి

vijayasai reddyఅమరావతి : ఎపి మాజీ సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విరుచుకపడ్డారు. తన పాలనలో చంద్రబాబు చిల్లర వేషాలు వేయడం వల్లనే ప్రజలు ఆయన్ను ఇంటికి పంపించారని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది తన వాళ్లపై ఐటి , ఇడిలు కేసులు పెట్టినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మోడీని గద్దె దింపుతా అంటూ చంద్రబాబు వార్నింగ్ లు ఇచ్చేవాడని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం యరపతినేని శ్రీనివాసరావు కేసును సిబిఐ టేకప్ తీసుకుంటుందన్న భయంతో చంద్రబాబు మళ్లీ చిల్లర వేషాలు వేయడం ప్రారంభించారని ఆయన దుయ్యబట్టారు. టిడిపి హయాంలో పల్నాడులో జరిగిన అరాచకాలు వెలుగులోకి రాకుండా చూసేందుకే టిడిపి నేతలు ఎదురు దాడి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Vijayasai Reddy Comments On TDP Chief Chandra Babu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిల్లర వేషాలు వేస్తున్న చంద్రబాబు : విజయసాయిరెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.