మా అమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి: విజయ్ దేవరకొండ

  హైదరాబాద్: ‘డియర్ కామ్రేడ్’ మూవీలో హీరోగా విజయ్ దేవరకొండ, హీరోయిన్‌గా రష్మిక మందన నటించారు. ఈ సినిమాలోని ‘కడలల్లే కన్నులే’ అనే పాటను విజయ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఒక రోజు తెల్లవారుజామున తాను నిద్ర లేవగానే భరత్ నుంచి ఆడియో ఫైల్ రూపంలో మెసేజ్ వచ్చింది. ఆ పాటను వినగానే సంతోషం రెట్టింపు అయిందని, ఆ పాటను ఇంట్లో ప్లే చేస్తుంటే మా అమ్మ కళ్ల నుంచి ఆనందబాష్పాలు కారడం చూశానన్నారు. ఈ […] The post మా అమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి: విజయ్ దేవరకొండ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ‘డియర్ కామ్రేడ్’ మూవీలో హీరోగా విజయ్ దేవరకొండ, హీరోయిన్‌గా రష్మిక మందన నటించారు. ఈ సినిమాలోని ‘కడలల్లే కన్నులే’ అనే పాటను విజయ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఒక రోజు తెల్లవారుజామున తాను నిద్ర లేవగానే భరత్ నుంచి ఆడియో ఫైల్ రూపంలో మెసేజ్ వచ్చింది. ఆ పాటను వినగానే సంతోషం రెట్టింపు అయిందని, ఆ పాటను ఇంట్లో ప్లే చేస్తుంటే మా అమ్మ కళ్ల నుంచి ఆనందబాష్పాలు కారడం చూశానన్నారు. ఈ సాంగ్ మీకోసం వినండని తన అభిమానులకు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ పాటకు జస్టిస్ ప్రభాకరణ్ సంగీతం అందించగా సిధ్ శ్రీరామ్, ఐశ్వర్యా రవిచంద్రన్ పాడారు. జూలై 26న సినిమాను విడుదల చేయనున్నట్టు సినిమా బృందం పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్‌పై రవి శంకర్, మోహన్ చెరుకూరి, యశ్ రంగినేని, నవీన్ ఎర్నేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

Vijaya Devara Konda Comments on Dear Comrade

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మా అమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి: విజయ్ దేవరకొండ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: