పీజీతో మేనేజర్ పోస్టు!

విజయా బ్యాంకులో 330 ఖాళీలకు ప్రకటన విడుదల బ్యాంకు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారికి ఓ అవకాశం వచ్చింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయా బ్యాంకు 330 ‘ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్’ పోస్టులను భర్తీ చేయబోతోంది. పీజీ స్థాయి అర్హతలున్నవారు దరఖాస్తు చేయటానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబరు 27లోగా దరఖాస్తు చేసుకుని, ఆన్‌లైన్ పరీక్షకు సిద్ధం కావాల్సివుంటుంది. దీనిలో, ఇంటర్వ్యూలో నెగ్గినవారు 3 నెలల ప్రత్యేక కోర్సును పూర్తిచేసి, ఆపై ఎగ్జిట్ టెస్టులో ప్రతిభ […]

విజయా బ్యాంకులో 330 ఖాళీలకు ప్రకటన విడుదల
బ్యాంకు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారికి ఓ అవకాశం వచ్చింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయా బ్యాంకు 330 ‘ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్’ పోస్టులను భర్తీ చేయబోతోంది. పీజీ స్థాయి అర్హతలున్నవారు దరఖాస్తు చేయటానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబరు 27లోగా దరఖాస్తు చేసుకుని, ఆన్‌లైన్ పరీక్షకు సిద్ధం కావాల్సివుంటుంది. దీనిలో, ఇంటర్వ్యూలో నెగ్గినవారు 3 నెలల ప్రత్యేక కోర్సును పూర్తిచేసి, ఆపై ఎగ్జిట్ టెస్టులో ప్రతిభ చూపించగలిగితేనే కొలువు దక్కుతుంది!

దేశవ్యాప్తంగా 2,125 బ్రాంచిలూ, 16 వేలమంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు విజయా బ్యాంకు. ఈ బ్యాంకు ప్రకటించిన ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టులకు దరఖాస్తు చేయాలంటే…కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీఎం/ పీజీబీఎం/ పీజీడీబీఏ ఉత్తీర్ణత లేదా కామర్స్/సైన్స్/ఎకనామిక్స్/లా లో పీజీ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ/కంపెనీ సెక్రటరీ చేసి ఉండాలి.

అభ్యర్థుల వయసు 1 ఆగస్టు 2018నాటికి 21-,30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. జనరల్ అభ్యర్థులు, ఇతరులు దరఖాస్తు ఫీజు, ఇంటిమేషన్ ఛార్జీలతో కలిపి రూ. 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కేవలం ఇంటిమేషన్ ఛార్జీ కింద రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులను సెప్టెంబరు 27లోగా పంపుకోవాలి.

ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు.

పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజికి 50 మార్కులు; బ్యాంకింగ్‌కు సంబంధించిన జనరల్ అవేర్‌నెస్‌కు 50 మార్కులు, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌కు 50 మార్కులను కేటాయించారు. అన్ని విభాగాలకూ కలిపి నిర్దేశించిన కాంపోజిట్ టైమ్ 120 నిమిషాలు. ఒక్కో తప్పు సమాధానానికి 1/4 చొప్పున మార్కులను తగ్గిస్తారు.

ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు బ్యాంకు ఎంచుకున్న ఓ సంస్థ నిర్వహించే ప్రత్యేక కోర్సును పూర్తిచేయాలి. దీని వ్యవధి మూడు నెలలు. ఈ కోర్సు అభ్యసించే సమయంలో నెలకు రూ. 15వేల స్టైఫండ్ చెల్లిస్తారు. కోర్సు పూర్తయిన వారికి ఎగ్జిట్ టెస్ట్ నిర్వహిస్తారు. దానిలో నిర్దిష్ట మార్కులు సాధించినవారికి మాత్రమే ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగావకాశం కల్పిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు: //ibps.sifyitest.com/vijayocsep18/
వెబ్‌సైట్: https://www.vijayabank.com/Careers/Car eers-List

Related Stories: