విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ షురూ

 

హైదరాబాద్: బాహుబలి సినిమా తర్వాత అందరీ చూపులు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలపైనే పడింది. పైగా హిందీలో రీమేక్ గా తెరకెక్కిన పలు తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత కలెక్షన్స్ రాబట్టాయి. ఇటీవల ‘అర్జున్ రెడ్డి’ సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్ తో రీమేక్ చేయగా.. 2019 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్లాపులతో సతమతవుతున్న షాహిద్ కపూర్ కు ఈ సినిమా ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో షాహిద్ మరో తెలుగు మూవీ ‘జర్సీ’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. దీనిబట్టి తెలుగు సినిమాలపై బాలీవుడ్ జనాలు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది.

ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాక్ స్టార్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఫైటర్’ సినిమాతో విజయ్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబయిలో ప్రారంభించారు. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహతాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Vijay Devarakonda Fighter Movie Shoot begins

The post విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.