కథ వినగానే ఓకే చెప్పేశాను!

బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కి బయోపిక్స్‌లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో ఆమె సిల్క్ స్మిత జీవిత కథలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌లో ఓ కీలక పాత్ర చేసింది. ఇప్పుడు మరో బయోపిక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈసారి వెండితెరకు సంబంధించిన వాళ్ల గురించి కాదు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి బయోపిక్‌లో నటించేందుకు ఓకే చెప్పింది. మ్యాథ్స్ జీనియస్ శకుంతలా దేవి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ […] The post కథ వినగానే ఓకే చెప్పేశాను! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కి బయోపిక్స్‌లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో ఆమె సిల్క్ స్మిత జీవిత కథలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌లో ఓ కీలక పాత్ర చేసింది. ఇప్పుడు మరో బయోపిక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈసారి వెండితెరకు సంబంధించిన వాళ్ల గురించి కాదు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి బయోపిక్‌లో నటించేందుకు ఓకే చెప్పింది. మ్యాథ్స్ జీనియస్ శకుంతలా దేవి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అను మీనన్ దర్శకత్వం వహించనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. శకుంతలా దేవి ఓ హ్యూమన్ కంప్యూటర్. ఐదు సంవత్సరాల వయస్సులో 18 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థుల మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ని సులువుగా సాల్వ్ చేసింది.
“శకుంతలా దేవి పాత్రలో నటించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఆమె ఒక బలమైన స్త్రీ. శకుంతల గారి ప్రతిభ ప్రపంచానికి తెలియాలన్నదే నా కోరిక” అంటోంది విద్య.

అసలు పేరు: విద్యా పి. బాలన్
ముద్దుపేరు: విధి
పుట్టిన తేదీ: 1 జనవరి 1978
పుట్టిన ఊరు: పూతమ్‌కురుసే, కేరళ
ఉండేది: ముంబయి
చదువు: సెయింట్ ఆంథోనీ గరల్స్ హై స్కూల్, సెయింట్ జేవియర్స్ కాలేజీ ఎమ్‌ఏ సోషియాలజీ.
కెరీర్ మొదలు: 1995లో హిందీలో హమ్‌పాంచ్ టీవీ షో
మొదటి సినిమా: భోలో థెకో 2003, బెంగాలీ సినిమా
హిందీ: పరిణీత 2005
తల్లిదండ్రులు: పిఆర్ బాలన్, సరస్వతీ బాలన్,
సోదరి: ప్రియాబాలన్
ఇష్టాలు: పుస్తకాలు చదవడం
టర్నింగ్ పాయింట్: 2011లో ద డర్టీ పిక్చర్ సినిమా (సిల్క్ స్మిత జీవితచరిత్ర ఆధారంగా తీసిన సినిమా)
ఇష్టమైన ఫుడ్: థాయ్
హీరో హీరోయిన్లు: షారూఖ్, అమితాబ్, షబానా అజ్మీ, మాధురీ దీక్షిత్
ఫేవరెట్ కలర్: రెడ్
భర్త : సిద్దార్థరాయ్ కపూర్, బిజినెస్‌మన్, ప్రొడ్యూసర్

Vidya Balan to play Math genius Shakuntala Devi

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కథ వినగానే ఓకే చెప్పేశాను! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.