రైతు బీమా తరహాలో పశు బీమా?

talasani-srinivas-yadav

మనతెలంగాణ/మెదక్  : మెదక్ జిల్లాలోని స్థానిక వైస్‌రాయ్ గార్డెన్స్‌లో గోపాలమిత్ర కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ నోరులేని మూగజీవాలలకు సేవచేసే అవ కాశం వచ్చిన గోపాలమిత్రలు నిజంగా అదృష్టవంతులేనన్నారు. కులవృత్తులకు పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులకు పంటసాయం, రైతుబీమా కార్యక్రమాలు రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెటర్నరీ ఆస్పత్రులను ఆప్‌గ్రేడ్ చేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్న వాటికి మరమ్మత్తులకు నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. పాడి రైతులకు ఇబ్బంది కలగకుండా సంచార పశువైద్య వాహనాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యిందని, ఈ కార్యక్రమం వల్ల గొల్లకుర్మ కుటుంబాలు ఆర్థికంగా నిలబడి ఉన్నాయన్నారు.

అలాగే 15 రోజుల్లో మిగతా కుటుంబాలకు రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడుతుందన్నారు. దేశం గర్వపడే స్థితిలో తెలంగాణ గొల్లకుర్మ కుటుంబాలు ఉన్నాయనిమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా కార్యక్రమం తరహాలో ప్రతిపశువుకు బీమా చేయాలనే ఆలోచనతో ఉన్నామన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. గోపాలమిత్రలకు గతంలో ఇచ్చిన వేతనం సరిపోవడం లేదని గుర్తించిన ముఖ్యమంత్రి రూ. 3500 నుంచి రూ. 8500లకు పెంచడం జరిగిందన్నారు. రైతు వద్ద నుంచి రూ. 130 రూపాయల కంటే అదనంగా వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసి వారి సంక్షేమానికి సైతం పెద్దపీట వేస్తుందన్నారు.

గతం కంటే గోపాల మిత్రలకు బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎల్‌డిఏ చైర్మన్ రాజేశ్వర్‌రావు, సీఈఓ మంజువాణి, పశుగణాభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ డా.రాంచందర్, జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, పశుసంవర్థక శాఖ జిల్లా చైర్మన్ లకా్ష్మరెడ్డి, సంస్థ జిల్లా డైరెక్టర్ నర్సింహరెడ్డితోపాటు జిల్లాల పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్లు, 1349 మంది గోపాలమిత్రలు, 65 మంది సూపర్‌వైజర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

veterinary insurance Scheme in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రైతు బీమా తరహాలో పశు బీమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.