వేపకాయల బతుకమ్మ

  తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో ఈరోజు ఏడవ రోజు బతుక మ్మ పండుగను వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు. ఇది నవరాత్రి పండుగ ఆరవ రోజున జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంత రాలు పేర్చుకుంటారు. ఈ రోజు ఫలహారంగా సకినాలపిండితో వేప పండ్ల రూపంలో తయారు చేస్తారు. అందుకే ఈ రోజు పండుగకు వేపకాయల బతుకమ్మ పండుగ అని పేరొచ్చింది. సాయంత్రం అంద రూ ఒక్కచోట చేరి బతుకమ్మ […] The post వేపకాయల బతుకమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో ఈరోజు ఏడవ రోజు బతుక మ్మ పండుగను వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు. ఇది నవరాత్రి పండుగ ఆరవ రోజున జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంత రాలు పేర్చుకుంటారు. ఈ రోజు ఫలహారంగా సకినాలపిండితో వేప పండ్ల రూపంలో తయారు చేస్తారు. అందుకే ఈ రోజు పండుగకు వేపకాయల బతుకమ్మ పండుగ అని పేరొచ్చింది. సాయంత్రం అంద రూ ఒక్కచోట చేరి బతుకమ్మ ఆట ఆడిపాడి నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత పిండి వేపకాయల ప్రసాదాన్ని పంచుకుంటారు.

చామంతి

పసుపు, తెలుపు వర్ణంతో మెరిసే చామంతులను బతుక మ్మలో వినియోగిస్తారు. ఇవి చర్మాన్ని మెత్తగా మెరిసేలా చేస్తాయి. వీటిని అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి నియంత్రణకు వాడుతారు. మొటిమలను తగ్గించ డం, శరీరాన్ని చల్లబరచడంలో చామంతి కీలక పాత్ర పోషిస్తుం ది. కాలేయ సంబంధ వ్యాధులకు మంచి ఔషధం. ఒత్తిడి, కోపంలాంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది.

బతుకమ్మ పాట

రామ రామ రామ ఉయ్యాలో

కలవారి కోడలు ఉయ్యాలో
కనక మహాలక్ష్మి ఉయ్యాలో
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో
కడవల్లోన పోసి ఉయ్యాలో
అప్పుడే వచ్చేను ఉయ్యాలో
ఆమె పెద్దన్న ఉయ్యాలో
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో
కన్నీళ్లు దీసి ఉయ్యాలో
ఎందుకు సెల్లెలా ఉయ్యాలో
ఏమి కష్టాలమ్మా ఉయ్యాలో
తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో
ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో
వెళ్లి వద్దాము ఉయ్యాలో
చేరిమి వారితో ఉయ్యాలో
చెప్పిరా పోవమ్మా ఉయ్యాలో
పట్టె మంచం మీద ఉయ్యాలో
పవళించిన మామా ఉయ్యాలో
మాయన్నల వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అత్తను అడుగు ఉయ్యాలో
అరుగుల్ల కూసున్న ఉయ్యాలో
ఓ అత్తగారు ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ బావను అడుగు ఉయ్యాలో
భారతం చదివేటి ఉయ్యాలో
బావ పెద్ద బావ ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అక్కను అడుగు ఉయ్యాలో
వంటశాలలో ఉన్న ఉయ్యాలో
ఓ అక్కగారూ ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
నీ భర్తనే అడుగు ఉయ్యాలో
రచ్చలో కూర్చున్న ఉయ్యాలో
రాజేంద్రభోగి ఉయ్యాలో
మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
మమ్ము పంపుతారా ఉయ్యాలో
కట్టుకో చీరలు ఉయ్యాలో
పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డను ఉయ్యాల
వెళ్లి రా ఊరికి ఉయ్యాలో
పుట్టినింటికి నీవు ఉయ్యాలో
శుభముగా పోయిరా ఉయ్యాలో
మెట్టినింటికి నీవు ఉయ్యాలో
క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో
మెట్టినింటికి నీవు ఉయ్యాలో
క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో

Vepakayala bathukamma in telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వేపకాయల బతుకమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: