మామ, అల్లుడు పాత్రల్లో ఒదిగిపోయారు

దసరా సందర్భంగా విడుదలైన ‘వెంకీ మామ’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్‌లో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. దగ్గుబాటి, అక్కినేని హీరోలు కలిసి నటిస్తున్న తొలి మల్టీస్టారర్ సినిమా ఇది. వెంకటేష్, నాగచైతన్య కెమిస్ట్రీ ఈ టీజర్‌కు ప్రధానమైన హైలైట్. మామ, అల్లుడు పాత్రల్లో వాళ్లిద్దరూ చక్కగా ఒదిగిపోయారు. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా… ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌లో సురేష్‌బాబు, టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెంకటేష్, నాగచైతన్య, రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.

Venky Mama teaser released

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మామ, అల్లుడు పాత్రల్లో ఒదిగిపోయారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.