13న వస్తున్న ‘వెంకీ మామ’

Venky Mama

 

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొందుతోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేస్తున్నారు. ఇక నాగచైతన్య, రాశీఖన్నా పుట్టిన రోజుల సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వారి టీజర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడు వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 13న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ హీరో రానా దగ్గుబాటి, దర్శకుడు బాబీ ఓ ఫన్నీ వీడియోను కూడా విడుదల చేశారు. ఇక భారీ ఎత్తున సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, లిరికల్ వీడియోలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ః ఎస్.ఎస్.తమన్, కెమెరాః ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్‌ః ప్రవీణ్ పూడి.

Venky Mama movie release on December 13th

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 13న వస్తున్న ‘వెంకీ మామ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.