నేను జీనీలాంటి వాడినిః వెంకటేష్

అమెరికా అగ్ర నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మాణంలో గాయ్ రిట్చయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమెరికన్ మ్యూజికల్ రొమాంటిక్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘అలాద్దీన్’. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను సీనియర్ స్టార్ వెంకటేష్, యంగ్ స్టార్ వరుణ్‌తేజ్ కలిసి విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ జీనీగా కనిపించనున్నాడు. ఇక అలాద్దీన్‌గా మేనా మసూద్ నటించగా, ప్రిన్స్ జాస్మిన్‌గా నయోమి స్కాట్ కనిపించనుంది. అయితే జీనీకి తెలుగులో […] The post నేను జీనీలాంటి వాడినిః వెంకటేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమెరికా అగ్ర నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మాణంలో గాయ్ రిట్చయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమెరికన్ మ్యూజికల్ రొమాంటిక్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘అలాద్దీన్’. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను సీనియర్ స్టార్ వెంకటేష్, యంగ్ స్టార్ వరుణ్‌తేజ్ కలిసి విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ జీనీగా కనిపించనున్నాడు. ఇక అలాద్దీన్‌గా మేనా మసూద్ నటించగా, ప్రిన్స్ జాస్మిన్‌గా నయోమి స్కాట్ కనిపించనుంది. అయితే జీనీకి తెలుగులో వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వగా…అలాద్దీన్‌కు వరుణ్‌తేజ్ డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ “జీనీ క్యారెక్టర్‌కు వాయిస్ ఇవ్వడమనేది కొత్త అనుభూతినిచ్చింది. మొదట్లో కొంచెం కష్టమనిపించింది. ఎందుకంటే చాలా మ్యాజిక్, ఫన్ ఉన్న క్యారెక్టర్ అది. జీనీ బాడీలాంగ్వేజ్ చాలా క్రేజీగా, ఫన్నీగా ఉంటుంది. ఇక నేను పాత్రలోకి ప్రవేశించాక చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పాను. నిజ జీవితంలో కూడా నేను జీనీ లాంటి వాడినే. నా పిల్లలకు ఏం కావాలంటే అది ఇచ్చాను”అని అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ “నాకు నిజ జీవితంలో జీనీలాంటి క్యారెక్టర్ వచ్చి ఏదైనా కోరుకోమంటే ఈ ప్రపంచంలో అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి పిల్లల స్టోరీలు చదివేందుకు చాలా ఇష్టపడతాను. నేను, మా చెల్లి కలిసి అలాంటి సినిమాలు, గేమ్స్ అన్నీ చూసేవాళ్లం. ‘అలాద్దీన్’ సినిమాలో డబ్బింగ్ చెప్పడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఒకరకంగా ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడమనేది ఛాలెంజింగ్‌గా అనిపించింది.

Venkatesh and Varun released Aladdin telugu trailer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేను జీనీలాంటి వాడినిః వెంకటేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: