మీరేమైనా మంత్రా?

  న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇంటింటికి సరఫరాచేసే నీటి నాణ్యత విషయంలో శుక్రవారం రాజ్యసభలో బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. సభా మర్యాదను పాటించాలని మందలించారు. ఢిల్లీలో మంచినీటి నాణ్యతపై జీరో అవర్‌లో బిజెపి సభ్యుడు విజయ్ గోయల్ చెప్పడం ప్రారంభించినప్పుడు ఈ వాగ్వాదం రేగింది. ‘దేశ రాజధానిలో నీటి నాణ్యత అధ్యాన్నంగా ఉంది. అది రక్షిత నీరు […] The post మీరేమైనా మంత్రా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇంటింటికి సరఫరాచేసే నీటి నాణ్యత విషయంలో శుక్రవారం రాజ్యసభలో బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. సభా మర్యాదను పాటించాలని మందలించారు. ఢిల్లీలో మంచినీటి నాణ్యతపై జీరో అవర్‌లో బిజెపి సభ్యుడు విజయ్ గోయల్ చెప్పడం ప్రారంభించినప్పుడు ఈ వాగ్వాదం రేగింది. ‘దేశ రాజధానిలో నీటి నాణ్యత అధ్యాన్నంగా ఉంది. అది రక్షిత నీరు కాదు’ అని విజయ్ గోయల్ అనగానే ఆప్ సభ్యు డు సంజయ్‌సింగ్ వెంటనే లేచి పెద్ద గొంతుతో ఖండనకు దిగారు.

సంజయ్ సింగ్ వ్యాఖ్యల్ని రికార్డు చేయకూడదని, రిపోర్టు చేయకూడదని ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశించారు. ఏ వ్యక్తిపైన లేదా ప్రభుత్వంపైన ఆరోపణలు చేయకూడదు కాబట్టి ఆయన వెంటనే కూచోవాలని సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ సంజయ్ సింగ్ వినకుండా కొనసాగించడంతో వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహంతో ‘సమస్య పరిష్కరించేందుకు మీరేమైనా మంత్రా?’ అని అడిగారు. వార్తా పత్రికల్లో ప్రచురించిన వ్యాసాలు, ఎయిర్ ప్యూరిఫయర్లు వాటర్ బాటిళ్లను సభలో ప్రదర్శించడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని, అనుమతించబోమని రాజ్యసభ ఛైర్మన్ హెచ్చరించారు.

Venkaiah warns MPs on notices, disruptions

The post మీరేమైనా మంత్రా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: