మహర్షి సినిమా భేష్ : వెంకయ్య

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన  ‘మహర్షి’ సినిమా చాలా బాగుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తన కుటుంబ సభ్యులతో కలసి ఈ సినిమాను చూశానని ఆయన పేర్కొన్నారు.  సినిమాలో మహేశ్ బాబు నటన  సహజంగా ఉందని ఆయన కొనియాడారు.  గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను ఈ సినిమాలో చక్కగా చూపించారని ఆయన చెప్పారు. హీరో మహేశ్ బాబు, ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, నటీనటులతో పాటు నిర్మాతలకు […] The post మహర్షి సినిమా భేష్ : వెంకయ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన  ‘మహర్షి’ సినిమా చాలా బాగుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తన కుటుంబ సభ్యులతో కలసి ఈ సినిమాను చూశానని ఆయన పేర్కొన్నారు.  సినిమాలో మహేశ్ బాబు నటన  సహజంగా ఉందని ఆయన కొనియాడారు.  గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను ఈ సినిమాలో చక్కగా చూపించారని ఆయన చెప్పారు. హీరో మహేశ్ బాబు, ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, నటీనటులతో పాటు నిర్మాతలకు వెంకయ్య అభినందనలు తెలిపారు. అయితే ఈ సినిమాలో చూపించిన వారాంతపు వ్యసాయం అనే అంశం చాలా బాగుందని ఆయన తెలిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఈ సినిమాను వీక్షించానని, గ్రామీణ ఇతివృత్తంతో పాటు వ్యవసాయ పరిరక్షణ, రైతులకు అండగా నిలవాలన్న సందేశంతో ఈ సినిమాను తీయడం అభినందించదగ్గ విషయమని వెంకయ్య పేర్కొన్నారు. ఈ సినిమాను ప్రతిఒక్కరూ చూడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వెంకయ్య బుధవారం ట్వీట్ చేశారు.

Venkaiah Comments on Maharshi Movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహర్షి సినిమా భేష్ : వెంకయ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: