గద్దలకొండ గణేష్‌గా వస్తున్నా!

Valmikiమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా ఈ సినిమా రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.

ఊహించినట్టుగానే వరుణ్ మాస్‌లుక్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిక్కీ జే మేయర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్‌కు హైలెట్. ‘ఈ మధ్యకాలంలో ఇంటిల్లిపాదీ కూర్చొని చూసే సినిమాలు ఎక్కడ వస్తున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వరుణ్ తేజ్ పాత్ర పేరు ‘గద్దలకొండ గణేష్’ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. వరుణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

పేరు : వరుణ్ తేజ్ కొణిదెల
తల్లిదండ్రులు : పద్మజ, నాగేంద్రబాబు కొణిదెల
పుట్టిన తేది : జనవరి 19, 1990
అలవాట్లు : క్రికెట్, పుస్తకాలు చదవడం
మొదటి సినిమా : ముకుంద (2015)
ఇష్టమైన ఆహారం : హైదరాబాద్ దమ్ బిరియాని
నటీనటులు : చిరంజీవి, పవన్‌కల్యాణ్, శ్రీదేవి, జయప్రద
డైరెక్టర్ : క్రిష్
రంగు : తెలుపు

Varun Tej Valmiki Movie 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గద్దలకొండ గణేష్‌గా వస్తున్నా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.