పవన్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ…

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కల్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో తనను ఓడించడానికి ప్రత్యర్థులు రూ. 150 కోట్లను ఖర్చు చేశారని పవన్ చేసిన వ్యాఖ్యలపై  వర్మ స్పందించారు. పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమేనని ఆర్జీవీ అన్నారు. పవన్ ను నిజంగా గెలిపించాలని ఓటర్లు అనుకుంటే, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా, అతనికే ఓటేసేవారని ఆయన పేర్కొన్నారు. తాను సేవ చేయాలని అనుకున్న ప్రజలు […] The post పవన్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కల్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో తనను ఓడించడానికి ప్రత్యర్థులు రూ. 150 కోట్లను ఖర్చు చేశారని పవన్ చేసిన వ్యాఖ్యలపై  వర్మ స్పందించారు. పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమేనని ఆర్జీవీ అన్నారు. పవన్ ను నిజంగా గెలిపించాలని ఓటర్లు అనుకుంటే, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా, అతనికే ఓటేసేవారని ఆయన పేర్కొన్నారు.

తాను సేవ చేయాలని అనుకున్న ప్రజలు అవినీతిపరులన్నట్టుగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాగా, శనివారం పవన్ మాట్లాడుతూ… తాను ఓడిపోవాలని రూ. 150 కోట్లు ఖర్చు పెట్టారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఓటమితో జనసేన కార్యకర్తలు కుంగిపోవద్దని, తాను 25 సంవత్సరాలు రాజకీయాలు చేయడానికే వచ్చానని కూడా జనసేనాని అన్నారు.

 

Varma Sensational Comments On Pawan Kalyan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పవన్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.