వరలక్ష్మికి స్వాగతం

  సమస్త సంపదలకు మూలం లక్ష్మీదేవి. లక్ష్మీకటాక్షం అందరికీ అవసరమే. సకల సౌభాగ్యాలతో సిరి సంపదలకు, శుభకార్యాలకు ఆవాసమైన శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీవ్రతాన్ని మహిళలందరూ భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. మహిళలందరూ భక్తి శ్రద్ధలతో, ఆనందంతో ఇళ్లల్లోనూ, గుళ్లల్లోనూ సామూహికంగా జరుపుకునే పండుగ వరలక్ష్మీవ్రతం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే మొదటి శుక్రవారం కానీ ఆ మాసంలోని రెండవ శుక్రవారం కానీ ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ రెండు వారాలూ కుదరని వారు పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారాల్లో చేసుకుంటారు. వ్రతం […] The post వరలక్ష్మికి స్వాగతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సమస్త సంపదలకు మూలం లక్ష్మీదేవి. లక్ష్మీకటాక్షం అందరికీ అవసరమే. సకల సౌభాగ్యాలతో సిరి సంపదలకు, శుభకార్యాలకు ఆవాసమైన శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీవ్రతాన్ని మహిళలందరూ భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.

మహిళలందరూ భక్తి శ్రద్ధలతో, ఆనందంతో ఇళ్లల్లోనూ, గుళ్లల్లోనూ సామూహికంగా జరుపుకునే పండుగ వరలక్ష్మీవ్రతం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే మొదటి శుక్రవారం కానీ ఆ మాసంలోని రెండవ శుక్రవారం కానీ ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ రెండు వారాలూ కుదరని వారు పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారాల్లో చేసుకుంటారు. వ్రతం చేసేరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఇంటి ముంగిట కళ్లాపు చల్లి, ముగ్గు పెట్టి, గుమ్మాన్ని పసుపు కుంకుమలు, మామిడాకుల తోరణాలతో అలంకరిస్తారు. ఇల్లాలు శుచిగా కలశం స్థాపించి అందులో లక్ష్మీదేవిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజిస్తారు.

అనంతరం విఘ్న నివారణకు గణపతి పూజ చేస్తారు. ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని పూజకు మాత్రమే ఉపయోగించే ఒక పంచపాత్రని కానీ, లోటాను గానీ తీసుకుని అందులో నీరు పోసి అక్షింతలు, పువ్వులు, తమలపాకులను ఉంచుతారు. దానికి బయట మూడు వైపులా పసుపు, కుంకుమ, గంథంతో కలశపూజ చేస్తారు. వరలక్ష్మి వ్రతం పూర్తయ్యాక చేతికి తోరం కట్టుకోవాలి. తోరం కట్టుకున్న తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకొని అక్షింతలు వేసుకుని ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చుకుంటారు. అందరికీ తీర్థప్రసాదాలిచ్చి, పూజ చేసినవారు కూడా స్వీకరిస్తారు. అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని ఆరగించి రాత్రి భోజనాన్ని పరిత్యజించాలి.

తోరం ఎలా తయారు చేయాలంటే?
తెల్లనినూలు దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు పూయా లి. ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూ లు కట్టి ముడులేయాలి. తయారు చేసిన తోరాలను పీఠం మీద ఉంచి గంథ పుష్పాక్షతలతో పూజించాలి.

పూజకు కావాల్సిన వస్తువులు
పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, అక్షింతలు, ( పసుపు గణపతిని ముందుగా తయారు చేసి ఉంచుకోవాలి.) ఎర్రటి రవిక, గంథం, పూలు, పండ్లు , తమలపాకులు, వక్కలు, తోరాలు చేసుకోవడానకి నూలు దారం, కొబ్బరికాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారం, దీపారాధనకు ఆవు నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు, అర్ఘ్యం పాత్ర (చిన్నగిన్నె) తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

Varalakshmi vratha vidhanam in telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వరలక్ష్మికి స్వాగతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.