అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

నల్లగొండ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చింతలపాలెం : అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తాను ఎమ్మెల్యేగా గెలవక ముందు ఉన్న హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిస్థితులను, ప్రస్తుత హుజూర్‌నగర్‌ను పరిశీలించి జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయాలని టిపిసిసి చీఫ్, నల్లగొండ ఎంపి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండల వ్యాపంగా ఆయా గ్రామాల్లో విసృత్తంగా పర్యటిస్తూ రోడ్డు షోలు, సమావేశాల్లో ప్రసంగించారు. నియోజకవర్గంలో అన్ని గ్రామా ల […] The post అభివృద్ధిని చూసి ఓటెయ్యండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
నల్లగొండ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

చింతలపాలెం : అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తాను ఎమ్మెల్యేగా గెలవక ముందు ఉన్న హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిస్థితులను, ప్రస్తుత హుజూర్‌నగర్‌ను పరిశీలించి జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయాలని టిపిసిసి చీఫ్, నల్లగొండ ఎంపి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండల వ్యాపంగా ఆయా గ్రామాల్లో విసృత్తంగా పర్యటిస్తూ రోడ్డు షోలు, సమావేశాల్లో ప్రసంగించారు. నియోజకవర్గంలో అన్ని గ్రామా ల రోడ్లను అభివృద్ధి చేశానని, కరెంట్ అంటే ఏంటో తెలియని ప్రాంతాలకు నాణ్యమైన కరెంట్‌ను తీసుకొచ్చిన ఘనత తనదేనని అన్నారు.

పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో నష్టపోయిన గ్రామాలకు నష్టపరిహారం, ఆర్‌ఎండ్‌ఆర్ సెంటర్ల ఏర్పాటు చేశానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడకుండా జరగనున్న బై ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. సిఎం కేసిఆర్, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా వ్యతిరేకతను కూడగట్టుకుందన్నారు. నిరుద్యోగ భృతి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, 3 ఎకరాల భూమి, రుణ మాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వంటి అంశాల్లో పూర్తిగా విఫలం చెందిందన్నారు. బై ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రతి కార్యకర్త నిద్రపోకుండా గతంలో కంటే రెట్టింపు పని చేయాలని కోరారు. పార్టీని వీడుతున్నా వారి గురించి పట్టించుకునే అవసరం లేదన్నారు.

ముజూర్‌నగర్ బై ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నారాల కొండారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చిలకల శ్రీనివాస్‌రెడ్డి, తోట శేషు, బుల్లి, సర్పంచ్‌లు నర్సింహమూర్తి, బుజ్జి హుస్సేన్, వీరారెడ్డి, రాములు నాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు ఇంద్రారెడ్డి, స్వామి నాయక్, తాత, ప్రభాకర్‌రెడ్డి, సీతారెడ్డి, సైదిరెడ్డి, కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Uttam starts election campaign in Huzurnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అభివృద్ధిని చూసి ఓటెయ్యండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: