ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా

  హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి బుధవారం రాజీనామ చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్గొండ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంఎల్‌ఎగా ప్రాతినిథ్యం వహిస్తున్న హుజుర్‌నగర్ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ముందుగా రాజీనామా వ్యవహారంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడారు. అనంతరం స్పీకర్ ఆదేశాల మేరకు ఉత్తమ్ నేరుగా అసెంబ్లీకి వెళ్ళి కార్యదర్శి నర్సింహ్మాచార్యులకు […] The post ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి బుధవారం రాజీనామ చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్గొండ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంఎల్‌ఎగా ప్రాతినిథ్యం వహిస్తున్న హుజుర్‌నగర్ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ముందుగా రాజీనామా వ్యవహారంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడారు. అనంతరం స్పీకర్ ఆదేశాల మేరకు ఉత్తమ్ నేరుగా అసెంబ్లీకి వెళ్ళి కార్యదర్శి నర్సింహ్మాచార్యులకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఉత్తమ్ రాజీనామాతో త్వరలో హుజుర్‌నగర్ స్థానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానం నుంచి ఉత్తమ్ తన భార్య పద్మావతిని పోటీకి నిలిబెట్టే అవకాశమున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.

 

 

Uttam Kumar reddy resigns his MLA Post

 

The post ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: