డబ్బులు తగలబెట్టిన దొంగబుద్ధి ఉత్తమ్ ది: జగదీశ్ రెడ్డి

  నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపి స్థానాలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో పంచడానికి తరలిస్తున్న డబ్బును పట్టుకోవడంతో కారులోనే డబ్బులు తగలబెట్టిన దొంగబుద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డిదని మండిపడ్డారు. ఎన్నికల తరువాత టిపిసిపి ప్రెసిడెంట్ ఉత్తమ్ శంకరగిరి మాన్యాలకు పంపడం ఖాయమని జగదీశ్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. సిఎం కెసిఆర్ అభివృద్ధి అజెండాను యావత్ ప్రజానీకం […] The post డబ్బులు తగలబెట్టిన దొంగబుద్ధి ఉత్తమ్ ది: జగదీశ్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపి స్థానాలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో పంచడానికి తరలిస్తున్న డబ్బును పట్టుకోవడంతో కారులోనే డబ్బులు తగలబెట్టిన దొంగబుద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డిదని మండిపడ్డారు. ఎన్నికల తరువాత టిపిసిపి ప్రెసిడెంట్ ఉత్తమ్ శంకరగిరి మాన్యాలకు పంపడం ఖాయమని జగదీశ్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. సిఎం కెసిఆర్ అభివృద్ధి అజెండాను యావత్ ప్రజానీకం ఆదరిస్తోందని పొగిడారు.

ఉత్తమ్‌కు మతిభ్రమించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి నరసింహరెడ్డి విమర్శించారు. దొంగ నోట్లు, కబ్జాల సంస్కృతి ఉత్తమ్ కుమార్‌దేనని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 11న ఉత్తమ్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, ప్రజాక్షేత్రంలో ఉత్తమ్‌కు తగిన గుణపాఠం తప్పదన్ని హెచ్చరించారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డబ్బులు తగలబెట్టిన దొంగబుద్ధి ఉత్తమ్ ది: జగదీశ్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: