టూత్‌పేస్ట్ ఉపయోగాలు…

  టూత్ పేస్ట్ పళ్లను శుభ్రం చేయడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే. పేస్టుతో ఇంకా చాలా చాలా చేసేయొచ్చు. రంగు రంగుల పేస్టులతో కంటే తెల్లని పేస్టు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అందాన్ని పెంపొందించుకోడానికే కాకుండా మరెన్నో పనులకు పేస్టును వాడేయొచ్చు. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు ఇది ఉపయోగకరమే. ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు, కళ్ల కింద సర్కిళ్లను తొలగించేందుకు టూత్ పేస్ట్ ఉపయోగపడుతుంది. ఇందుకు తెల్లటి టూత్ పేస్ట్ మాత్రమే వాడాలి. ఇందులో ఫ్లోరైడ్ తక్కువగా […] The post టూత్‌పేస్ట్ ఉపయోగాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టూత్ పేస్ట్ పళ్లను శుభ్రం చేయడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే. పేస్టుతో ఇంకా చాలా చాలా చేసేయొచ్చు. రంగు రంగుల పేస్టులతో కంటే తెల్లని పేస్టు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అందాన్ని పెంపొందించుకోడానికే కాకుండా మరెన్నో పనులకు పేస్టును వాడేయొచ్చు. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు ఇది ఉపయోగకరమే.
ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు, కళ్ల కింద సర్కిళ్లను తొలగించేందుకు టూత్ పేస్ట్ ఉపయోగపడుతుంది. ఇందుకు తెల్లటి టూత్ పేస్ట్ మాత్రమే వాడాలి. ఇందులో ఫ్లోరైడ్ తక్కువగా ఉంటుంది. అందువల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు. ఈ చిట్కాలను పాటించే ముందు పేస్ట్‌పై రాసే ఇంగ్రిడియన్స్‌ని చూడాలి. తక్కువ ఫ్లోరైడ్ శాతం ఉన్న టూట్ పేస్ట్‌ని మాత్రమే వాడాలి. మీకు గతంలో ఏమైనా ఎలర్జీలు ఉన్నట్లయితే టూత్ పేస్ట్‌ను కొంచెం చేతికి రాసుకుని 5 నిమిషాలు అలా వదిలేయండి. మంట, దురద, ఎలర్జీలు ఏమైనా వస్తే ఈ చిట్కాలను పాటించవద్దు.
మొటిమలు మాయం: ఒక గిన్నెలోకి కొంచెం టూట్ పేస్ట్ తీసుకోవాలి. అందులో తేనె వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మొటిమల సమస్యే ఉండదు.
బ్లాక్ హెడ్స్: ఒక గిన్నెలోకి కొంచెం టూత్ పేస్ట్, ఉప్పు తీసుకుని కాస్త నీరు పోసి కలపండి. ఈ మిశ్రమాన్ని రాసే ముందు ముఖానికి ఆవిరపట్టండి. దీనివల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. కొన్ని నిమిషాల తర్వాత ఉప్పు, పేస్ట్ మిశ్రమాన్ని ముకానికి రాసుకోండి. 10,- 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
చర్మంపై ముడతలు: ముడుతలు, మచ్చలను తొలగించి చర్మాన్ని బిగుతుగా చేయడంలో టూత్ పేస్ట్ బాగా పనిచేస్తుంది. ఎండ వల్ల చర్మం కందితే కాస్త నిమ్మరసం, పేస్ట్ కలిపి రాయండి. చర్మం పూర్వస్థితికి వచ్చి తాజాగా ఉంటుంది.

 

Uses of Toothpaste

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టూత్‌పేస్ట్ ఉపయోగాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.