వాస్తు దోషాలకు ఉప్పుతో చెక్!

వాస్తు దోషాలను సరిచేయడంతోపాటు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని రప్పించడంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉందని హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ వాస్తు పండితుడు ఆచార్య ఇందు ప్రకాశ్ అంటున్నారు. అంతేకాదు..ఇంటికి సిరిసంపదలు తీసుకురావడంలో కూడా ఉప్పు కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు ఆయన. ఇంటికి వాస్తు దోషాలుంటే వాటిని సరిచేయడానికి ఆయన చెబుతున్న పరిష్కారం ఏమిటంటే.. ఒక చిన్న కప్పులో కాని మట్టి ముంతలో కాని కొద్దిగా మెత్తటి ఉప్పు, నాలుగు లేదా ఐదు లవంగాలు ఉంచి […] The post వాస్తు దోషాలకు ఉప్పుతో చెక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాస్తు దోషాలను సరిచేయడంతోపాటు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని రప్పించడంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉందని హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ వాస్తు పండితుడు ఆచార్య ఇందు ప్రకాశ్ అంటున్నారు. అంతేకాదు..ఇంటికి సిరిసంపదలు తీసుకురావడంలో కూడా ఉప్పు కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు ఆయన. ఇంటికి వాస్తు దోషాలుంటే వాటిని సరిచేయడానికి ఆయన చెబుతున్న పరిష్కారం ఏమిటంటే.. ఒక చిన్న కప్పులో కాని మట్టి ముంతలో కాని కొద్దిగా మెత్తటి ఉప్పు, నాలుగు లేదా ఐదు లవంగాలు ఉంచి దాన్ని ఇంట్లోని నాలుగు మూలల్లో ఏదో ఒక మూల ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు పోవడంతో పాటు ఇంట్లోకి సిరిసంపదలు చేరుకుంటాయి.

అంతేగాక ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని అంటున్నారు ఆయన. అదే విధంగా ఇంట్లోని బాత్‌రూమ్‌కు సంబంధించిన వాస్తుదోషాలకు కూడా పరిష్కారం సూచిస్తున్నారు ఈ వాస్తు సిద్ధాంతి. ఒక చిన్న పాత్రలో కొద్దిగా రాళ్ల ఉప్పు తీసుకుని, ఆ పాత్రను బాత్‌రూమ్‌లో ఎవరూ తాకనంత ఎత్తులో ఉండే ప్రదేశంలో ఉంచాలి. అప్పుడప్పుడు ఉప్పును మార్చుతుండాలి. అలా చేయడం వల్ల వాస్తుదోషాలు పోతాయి. ఇంట్లో సుగంధభరితమైన వాతావరణం రావాలంటే కొద్దిగా ఉప్పు, కొన్ని లవంగాలను ఒక గాజు పాత్రలో వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి టేబుల్ మీద కాని గూట్లో కాని ఉంచాలంటున్నారు ఆయన.

Use salt to bring prosperity in your house,  Vastu Tips: Use salt to bring prosperity in your house, remove vastu dosh using these tricks

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాస్తు దోషాలకు ఉప్పుతో చెక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: