అమెరికాలో కరోనా మృతులు వెయ్యి

  66 వేల మంది రోగులు వాషింగ్టన్ : న్యూయార్క్, న్యూజెర్సీ వంటి పలు నగరాలలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తొలి దశలో నిర్లక్ష కారణంగా అమెరికాలో ఇప్పుడు కరోనా కారణంగా మృతుల సంఖ్య వేయి దాటిందని వెల్లడైంది. కరోనా సో కిన వారి సంఖ్య 66వేలు దాటింది. దేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉండాల్సి వచ్చింది. కాలిఫోర్నియా, లూసియానా, ఫ్లోరిడా వంటి నగరాలు ఇప్పుడు కరోనాతో గడగడలాడుతున్నాయి. నాలుగురోజుల క్రితం దేశంలో కరోనాతో […] The post అమెరికాలో కరోనా మృతులు వెయ్యి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

66 వేల మంది రోగులు

వాషింగ్టన్ : న్యూయార్క్, న్యూజెర్సీ వంటి పలు నగరాలలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తొలి దశలో నిర్లక్ష కారణంగా అమెరికాలో ఇప్పుడు కరోనా కారణంగా మృతుల సంఖ్య వేయి దాటిందని వెల్లడైంది. కరోనా సో కిన వారి సంఖ్య 66వేలు దాటింది. దేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉండాల్సి వచ్చింది. కాలిఫోర్నియా, లూసియానా, ఫ్లోరిడా వంటి నగరాలు ఇప్పుడు కరోనాతో గడగడలాడుతున్నాయి. నాలుగురోజుల క్రితం దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 300లోపే ఉంది, అయితే ఇది ఇప్పుడు వేయి దాటడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికాలో పలు ప్రాం తాలలో కరోనా నేపథ్యంలో అక్కడి తెలుగు వారి కుటుంబాల పరిస్థితిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వారి ఆత్మీయులలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ
కరోనా వైరస్‌తో దెబ్బతిన్న అమెరికాలో అసమాన రీతిలో 2.2 ట్రిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ప్రకటించారు. దీనికి సెనెట్ గురువారం ఆమోదం తెలిపింది. వ్యాపారవర్గాలు, కార్మికులు, ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థలకు ఈ భారీ స్థాయి ప్యాకేజీ పరిధిలో సాయం అందుతుంది. సెనెట్ ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దేశానికి ఇది అత్యంత తీవ్ర సవాలుగానే మారిందని సభ్యులు అంతా పేర్కొన్నారు. అయితే ప్యాకేజీ ఆలస్యం జరిగిందని, తక్కువ స్థాయిలోనే ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయిలో తక్షణమే స్పందించి ఉంటే బాగుండేదని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక సాయానికి సంబంధించి పలు చర్యలను 880 పేజీల ప్యాకేజీలో వివరించారు.

అమెరికా చరిత్రలో ఒక అంశంపై రెండు లక్షల కోట్ల డాలర్లకు పైగా సాయం ప్రకటించడం ఇదే తొలిసారి, ఈవిధంగా ఇది అత్యంత భారీ స్థాయి ఆర్థిక ప్యాకేజీగా నిలిచింది. మనిషి జీవితకాలంలో అత్యంత అరుదుగా ఇటువంటి పెను అనారోగ్య సవాళ్లు ఏర్పడుతాయి. ఏది ఏమైనా కరోనా కలకాలం ఇదే విధమైన దుర్భర పరిస్థితిని కొనసాగిస్తుందని అనుకోరాదని దేశాధ్యక్షులు ట్రంప్ చెప్పారు. దేశ ఆర్ఖిక వ్యవస్థ తిరిగి వేగం పుంజకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

US reaches 1,000 deaths in coronavirus crisis

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమెరికాలో కరోనా మృతులు వెయ్యి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: