గ్రీన్‌కార్డు కోటా పరిమితి ఎత్తివేత

వాషింగ్టన్ : అమెరికాలో అత్యంత కీలకమైన గ్రీన్‌కార్డు బిల్లుకు ప్రతినిధుల సభ భారీ ఆధిక్యతతో ఆమోదం తెలిపింది.గ్రీన్‌కార్డుల జారీపై దేశాలకు విధించిన ఏడు శాతం కోటా పరిమితిని తొలిగించేందుకు ఈ బిల్లులో కీలక ప్రతిపాదన ఉంది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరం అయిన గ్రీన్‌కార్డులకు సంబంధించి ట్రంప్ అధికార యంత్రాంగం దేశాల వారిగా ఏడు శాతం కోటా పెట్టింది. అయితే ఈ నిబంధనను తొలిగిస్తూ ఇప్పుడు వెలువడ్డ బిల్లు చట్టం కానుండటంతో భారతదేశంతో పాటు పలు దేశాలకు […] The post గ్రీన్‌కార్డు కోటా పరిమితి ఎత్తివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాషింగ్టన్ : అమెరికాలో అత్యంత కీలకమైన గ్రీన్‌కార్డు బిల్లుకు ప్రతినిధుల సభ భారీ ఆధిక్యతతో ఆమోదం తెలిపింది.గ్రీన్‌కార్డుల జారీపై దేశాలకు విధించిన ఏడు శాతం కోటా పరిమితిని తొలిగించేందుకు ఈ బిల్లులో కీలక ప్రతిపాదన ఉంది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరం అయిన గ్రీన్‌కార్డులకు సంబంధించి ట్రంప్ అధికార యంత్రాంగం దేశాల వారిగా ఏడు శాతం కోటా పెట్టింది. అయితే ఈ నిబంధనను తొలిగిస్తూ ఇప్పుడు వెలువడ్డ బిల్లు చట్టం కానుండటంతో భారతదేశంతో పాటు పలు దేశాలకు చెందిన వేలాది మంది వృత్తి నిపుణులకు అశాంతి తొలుగుతుంది. బిల్లు చట్టరూపం దాలిస్తే దేశాలవారిగా కుటుంబ ప్రాతిపదికన వచ్చే వారికి గ్రీన్‌కార్డుల పరిమితి పెరుగుతుంది. ఇది 15 శాతానికి పెరిగేందుకు వీలేర్పడుతుంది. భారత్‌కు చెందిన అత్యంత నిపుణులైన ఐటివారు అమెరికాకు ప్రత్యేకించి హెచ్ 1 బి వీసాలపై వస్తుంటారు. అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం పాటిస్తోన్న విధానంతో ఈ వర్క్ వీసాలు దక్కడం క్లిష్టంగా మారింది. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్‌లో ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 2019 పేరిట బిల్లు తీసుకువచ్చారు. దీనిని హెచ్‌ఆర్ 1044గా కూడా వ్యహరిస్తున్నారు. ఉద్యోగ ప్రాతిపదిక వలసలకు సంబంధించిన పరిమితులను ఎత్తివేసేందుకు దీనిని తీసుకువచ్చారు. అయితే ఈ బిల్లు సెనెట్‌లో కూడా ఆమోదం పొందితేనే చట్టంగా రూపొందుతుంది. అక్కడ అధికార రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత ఉండటంతో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం లేకుండా పొయ్యే వీలు కూడాఉంది. సెనెట్ ఆమోదం దక్కితేనే చట్టం అవుతుంది.

US House passes Bill removing country cap on Green Cards

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గ్రీన్‌కార్డు కోటా పరిమితి ఎత్తివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: