17నుంచి అమెరికన్ కాన్సులేట్ ప్రారంభం

US Consulate in Hyderabad resume from August 17

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం గత కొన్ని రోజులుగా మూతపడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తలో భాగంగా ఈ కార్యాలయాన్ని దాదాపు 4 నెలలుగా మూసేశారు. కాగా, హైదరాబాద్ లో కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. దీంతో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాన్ని తిరిగి తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచి సేవలు ప్రారంభం కాబోతున్నాయి. స్టూడెంట్ వీసా, ఉద్యోగ వీసాల సేవలు సోమవారం నుంచే అందుబాటులో ఉంటాయని కాన్సులేట్ కార్యాలయం ప్రకటించింది.

US Consulate in Hyderabad resume from August 17

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post 17నుంచి అమెరికన్ కాన్సులేట్ ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.