కెటిఆర్‌ని కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్

  హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ మాన్ పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావును బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. మసాబ్ ట్యాంక్ లోని పురపాలక భవనంలో మంత్రిని కలిసిన అయన రెండోసారి మంత్రిగా పదవీభాద్యతలు స్వీకరించిన సందర్బంగా కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అమెరికన్ పెట్టుబడులు, భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలను ఇరువురు చర్చించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా నగరం అభివృద్ధి పథంలో దూసుకుపొతున్నదని […] The post కెటిఆర్‌ని కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ మాన్ పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావును బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. మసాబ్ ట్యాంక్ లోని పురపాలక భవనంలో మంత్రిని కలిసిన అయన రెండోసారి మంత్రిగా పదవీభాద్యతలు స్వీకరించిన సందర్బంగా కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అమెరికన్ పెట్టుబడులు, భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలను ఇరువురు చర్చించారు.

దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా నగరం అభివృద్ధి పథంలో దూసుకుపొతున్నదని వివరించిన కెటిఆర్ వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించారు. గత కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా బదిలీ అనంతరం నూతన కాన్సుల్ జనరల్ గా జోయల్ రీఫ్ మాన్ భాద్యతలు స్వీకరించారు. కాన్సుల్ జనరల్ తోపాటు కాన్సులర్ ఛీఫ్ ఏరిక్ అలగ్జాండర్, ఎకానమిక్ స్పెషలిస్ట్ క్రిష్టెన్ లోయిర్ లు మంత్రిని కలిసిన బృందంలో ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు కూడా ఉన్నారు.

US consul general who met KTR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కెటిఆర్‌ని కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: