ఇది హత్యకేసు కాదు.. తక్షణం విడుదల చేయండి

యుపి జర్నలిస్టు అరెస్టు కేసులో సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ చేసిన వ్యవహారంలో ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇది హత్య కేసు కాదని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జర్నలిస్టుకు బెయిల్ ఇవ్వడమంటే ఆయన చేసిన పోస్టులను న్యాయస్థానం సమర్థించినట్లు కాదని, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రశాంత్ కనోజియా ఇటీవల […] The post ఇది హత్యకేసు కాదు.. తక్షణం విడుదల చేయండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

యుపి జర్నలిస్టు అరెస్టు కేసులో సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ చేసిన వ్యవహారంలో ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇది హత్య కేసు కాదని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జర్నలిస్టుకు బెయిల్ ఇవ్వడమంటే ఆయన చేసిన పోస్టులను న్యాయస్థానం సమర్థించినట్లు కాదని, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రశాంత్ కనోజియా ఇటీవల తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. సిఎం కార్యాలయం ఎదుట ఒక మహిళ మీడియాతో మాట్లాడుతూ సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు తాను పెళ్లి ప్రతిపాదన పంపానని చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోపై ఆగ్ర హం చెందిన కొందరు ప్రశాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం రాత్రి కనోజియాను అరెస్టు చేశా రు. అయితే ఈ అరెస్టును సవాలు చేస్తూ కనోజియా భార్య జగీశా అరోరా సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి అరెస్టు వారెంట్ జారీ చేయకుండానే తన భర్తను పోలీసులు తీసుకెళ్లారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. జగీశా అభ్యర్థనపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు యుపి పోలీసుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.‘వ్యక్తికి స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. సాధారణంగా మేము ఇలాంటి కేసుల ను విచారించం. అయితే సోషల్ మీడియా పోస్టుల కారణంగా ఒక వ్యక్తి 11రోజులు జైల్లో ఉండడం సరికాదు. అందుకే ఈ పిటిషన్‌ను విచారించాం’ అని న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, అజయ్ రస్తోగిలతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు ఒక్కోసారి న్యాయస్థానాలు సైతం సోష ల్ మీడియా దాడులకు గురికావలసి వస్తోందని కూడా వ్యాఖ్యానించింది. నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కారణంగా ఈ పిటిషన్‌ను విచారించడానికి వీలులేదని యుపి ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్ జిత్ బెనర్జీ అన్నారు. అయితే వ్యక్తిగత హక్కుల విషయంలో రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పిందని, ఒక వేళ ఇది రాజ్యాంగంలోని 32 అధికరణకు సంబంధించినదైనా సుప్రీంకోర్టు దీన్ని విచారించవచ్చని, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు చూస్తూ ఉండలేదని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఇదేమీ హత్య కేసు కాదని, జర్నలిస్టుకు బెయి లు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. కనోజియాను తక్షణం విడుదల చేయాలని యుపి పోలీసులను ఆదేశించింది.

కోర్టు తీర్పు నా విశ్వాసాన్ని నిలిపింది: జగీశా
కాగా, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం పట్ల తన విశ్వాసాన్ని మరో సారి నిలబెట్టిందని కనోజియా భార్య జగీశా అరోరా వ్యాఖ్యానిం చారు. యుపి పోలీసులు మితిమీరి ప్రవర్తించారని కూడా కోర్టు వ్యాఖ్యానించిందని ఆమె అన్నారు. కాగా కనోజియా సోషల్ మీడి యాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉంచిన వీడియో గురించి విలేఖరులు ప్రశ్నించగా, అందులో అభ్యంతరకరమైంది ఏమీ లేదని తాను అనుకొంటున్నానని ఆమె చెప్పారు.

UP Govt to release journalist prashant kanojia: Supreme

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇది హత్యకేసు కాదు.. తక్షణం విడుదల చేయండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: