కనిపించని జనరిక్ మందుల దుకాణాలు

సుప్రీం కోర్టు ఆదేశాలు బుట్టదాఖలు పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రోగులపై ఆర్థిక భారం  మనతెలంగాణ / ఆసిఫాబాద్: కుమ్రంభీం జిల్లాలో జనరిక్ మందుల దుకాణాలు కనిపించిన దాఖలాలులేవు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు విధిగా రోగులకు జనరిక్ మందులను రాయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా జిల్లాలో జనరిక్ మందుల దుకాణాలే కనిపించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు జనరిక్ మందులు నాసిరకం అంటు ప్రచారం చేస్తూ బ్రాండ్ కంపెనీల పేరిట […]

సుప్రీం కోర్టు ఆదేశాలు బుట్టదాఖలు
పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
రోగులపై ఆర్థిక భారం 

మనతెలంగాణ / ఆసిఫాబాద్: కుమ్రంభీం జిల్లాలో జనరిక్ మందుల దుకాణాలు కనిపించిన దాఖలాలులేవు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు విధిగా రోగులకు జనరిక్ మందులను రాయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా జిల్లాలో జనరిక్ మందుల దుకాణాలే కనిపించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు జనరిక్ మందులు నాసిరకం అంటు ప్రచారం చేస్తూ బ్రాండ్ కంపెనీల పేరిట ఎక్కువ ధరలకు మందులను అమ్ముతుండగా రోగులపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుంది. గతంలో జిల్లాలోని కాగజ్‌నగర్ మండలంలో మూడు సంవత్సరాల క్రితం జనరిక్ మందుల దుకాణం ఉండేది. ప్రముఖ మందుల కంపెనీలకు చెందిన మెడికల్ రిప్రజెంటివ్‌లు ప్రైవేటు వైద్యులను మచ్చిక చేసుకొని తమ మందుల కంపెనీ అమ్మకాలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో మందుల కొనుగోళ్ళపై 30 నుంచి 40 శాతం కమిషన్‌ల పేరిట నగదును ఇస్తూ ఇతర ప్రోత్సాకాలను కలిపిస్తున్నట్లు ప్రచారం. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో మెడికల్ ఏజెన్సీలు ఉండగా,సుమారు 200 వరకు మెడికల్ షాపులు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున ప్రైవేటు వైద్యులే వైద్య సేవలు అందిస్తుండగా, జనరిక్ మందులను రోగులకు రాయడం లేదని తెలుస్తుంది. బ్రాండ్ కంపెనీల పేరిట మెడికల్ దుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కు అవుతుండగా ఏటా రోగులపై కోట్ల రూపాయల భారంపడుతుంది. జిల్లాలోని కాగజ్‌నగర్ కేంద్రంలో సుమారు 20వరకు ప్రైవేటు నర్సింగ్ హోంలు నడుస్తుండగా జిల్లాలోని మారుమూల మండలాల ప్రజలు దీనిపై ఎక్కువ వైద్యసేవలకు ఆధారపడి ఉన్నారు. ప్రతి నర్సింగ్ హోంకు వ్యక్తిగత మెడికల్ దుకాణాలు ఉండగా జనరిక్ మందుల జాడలేకుండా పోతుంది. ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యులు కమిషన్‌లకు కక్కుర్తిపడుతూ రోగుల జేబులకు చిల్లులు పెడతున్నారు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందుల ధర అత్యంత తక్కువగా ఉంటుంది. విధిగా రోగులకు సంబంధించిన మందుల ఫార్మూల ఒక్కటే అయినప్పటికీ రోగుల ఆర్థిక పరిస్థితిని గమనించి జనరిక్ మందులను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వైద్యులు పెడచెవిన పెడుతున్నారు. జనరిక్ మందుల ధరలతో పోలిస్తే బ్రాండ్ మందుల ధరలు 60నుంచి70శాతం ఎక్కువగా ఉంటున్నాయి. బ్రాండెడ్‌ల పేరుతో కంపెనీలు వారి ఉద్యోగుల జీతభత్యాలు, ప్రచారం, వైద్యులకు ఇచ్చే ప్రోత్సాహకాలు అన్ని కలిపి వినియోగదారులపై భారం మోపుతున్నారు. ప్రస్తుతం ప్రతి ప్రైవేటు ఆస్పత్రులకు అనుసంధానంగా ఉండగా, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా తాము సూచించిన చోటనే చేయించుకోవాలని నిబంధనలు విధిస్తూ రోగులకు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. చిన్నపాటి రోగులకు సైతం బ్రాండెడ్ కంపెనీలకు చెందిన మందులను రాస్తుండటంతో రోగులపై అదనపు భారంపడుతుంది. అంతేకకాకుండా మందుల చీటిపై మందుల పేర్లే కాకుండా కంపెనీల పేర్లను కోడ్ భాషలో చూపిస్తూ కమీషన్ల పర్వానికి దారులు వేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. మందుల చీటిలో విడిఅక్షరాలతో రాయాల్సివుండగా జనరిక్ మందులు రాసేలా డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రోగులపై ఆర్థిక భారంపడుతుంది. జిల్లాలో 18పిహెచ్‌సిల పరిధిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో గిరిజన గ్రామాల ప్రజలు రోగాలబారిన పడితే ప్రైవేటు వైద్యులను ఆశ్రయించక తప్పడం లేదు. ఆర్థిక భారం ఎక్కువగా అవుతుండగా పలువురు నాటువైద్యంపై ఆధారపడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం జిల్లా ఏర్పడినప్పటికీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో మందుల కొరత లేకున్నా సిబ్బంది కొరతతో సరైనా వైద్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు అందడం లేదంటున్నారు.

Related Stories: