బీమా లేని వాహనాలు 65 శాతం…

తనిఖీలు నామ మాత్రమే. జరిమానాతో సరిపెడుతన్న అధికారులు హైదరాబాద్: ప్రతి వాహనానికి బీమా చేయించాలి. ప్రమాద సమయంలో అదే అండగా ఉంటుంది. మోటారు వానాల చట్టంలోనూ ప్రతి వాహనానికి బీమా తప్పని సరిగా ఉండాలని ఉంది. ప్రతి సంవత్సరం బీమా పునరుద్దరించుకుంటూ ఉండాలి లేక పోతే. వాహనాలకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు రూ.100 ఇతర ఉవాహనాలకు రూ.500 వరకు జరిమానా విధించ వచ్చు.ఇలా ఎన్నో నిబంధనలు అమల్లో ఉన్నా బీమా విష యంలో […] The post బీమా లేని వాహనాలు 65 శాతం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
తనిఖీలు నామ మాత్రమే. జరిమానాతో సరిపెడుతన్న అధికారులు

హైదరాబాద్: ప్రతి వాహనానికి బీమా చేయించాలి. ప్రమాద సమయంలో అదే అండగా ఉంటుంది. మోటారు వానాల చట్టంలోనూ ప్రతి వాహనానికి బీమా తప్పని సరిగా ఉండాలని ఉంది. ప్రతి సంవత్సరం బీమా పునరుద్దరించుకుంటూ ఉండాలి లేక పోతే. వాహనాలకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు రూ.100 ఇతర ఉవాహనాలకు రూ.500 వరకు జరిమానా విధించ వచ్చు.ఇలా ఎన్నో నిబంధనలు అమల్లో ఉన్నా బీమా విష యంలో వాహన యజమానులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

వేల లక్షలు ఖర్చు మరీ వాహనాలను కొనుగోలు చేస్తున్న వారు బీమా విషయంలో మాత్రం నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలకు బీమా చేయిస్తే అది ఎన్నో విధాలుగా రక్షణ ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాని ఈ విషయాన్ని వాహన దారులు ఏ మాత్రం గుర్తించడం లేదు. నగరంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో వాహనాలు పెరిగి పోతున్నాయి. వాహన కొనుగోలు సమయంలో బీమా ఉంటుంది.ఆ తర్వాత నుంచి వాహనదారుల ఇష్టంగా మారింది. నగరంలో తరచు జరిగే రోడ్డు ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నా వాహన దారులు నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

మోటారు హనాల చట్టం ప్రకారం నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లోని రోడ్లపై వివిధ రకాల వాహనాలు తిరుగుతున్నాయి. వీటిలో రవాణా, వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రవాణా వాహనాలకు ప్రతి సంవత్సరం సామర్థ పరీక్షలు నిర్వహించే సమయంలో బీమా చేయించినట్లు చూపించాలి. అవి ఉంటేనే రవాణాశాఖ అధికారులు సామర్థ పరీక్షలు నిర్వహిస్తారు.

వ్యక్తిగత వాహనాలకు సామర్థ పరీక్షలు అవసరం లేక పోవడంతో వారు బీమా విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై అవగాహన ఉన్న యజమానులు మాత్రం క్రమం తప్పకుండా బీమాను పునరుద్దరించుకుంటున్నారు. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు బీమా చేయించుకునే విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. నగరంలో తిరిగే ద్విచక్క వాహనాల్లో 65 శాతం బీమా లేదని గుర్తించారు.

సాధారణంగా కొత్త వాహనాల కొనుగోలు సమయంలోనే బీమా తప్పని సరిగా తీసుకోవాలి లేదంటే రిజిస్ట్రేషన్ కాదు .దీంతో తప్పని సరిగా పరిస్థితుల్లో బీమా తీసుకుంటున్న వాహన దారులు అనంతరం దాన్ని కొనసాగిచండం లేదు. వాహనాలకు కాంప్రెన్సివ్,థర్డ్‌పార్టీ ,పబ్లిక్ లయబుల్టీ, పేర్లతో మూడు రకాలు బీమా తీసుకోవచ్చు. సుమారు 30 కంపెనీలుఇటువంటి పాలసీలను విక్రయిస్తున్నాయి. కాంప్రెన్సివ్ కింద వాహనంతో పాటు ఇతర ప్రాణాలకు ఎటువంటి హనికలిగినా బీమా వర్తిస్తుంది. థర్ పార్టీలో తమ వాహనం కారణంగా ఇతరుల ప్రాణాలు పోతే దానికి పరిహరం బీమా కంపెనీ చెల్లిస్తుంది.

పబ్లిక్ లయబుల్టి కింద ప్రజలు,ప్రభుత్వ ఆస్తులకు ప్రాణాలకు భంగం కలిగినప్పుడు బీమా చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం బీమా చెల్లించి ప్రీమియం తీసుకోవాలి.వాహనం తరుగును బట్టి ప్రతి సంవత్సరం ప్రీమియం మారుతుంటుంది. మొదటి సంవత్సరం పాలసీలను తీసుకుంటున్న వాహన దారు రెండో సంవత్సరం నుంచి దాని మీద దృష్టిపెట్టడం లేదన సంగతి అధికారులు తనిఖీలు

నిర్వహించిప్పడు బయట పడుతోంది.
బీమా తప్పని సరిగా చేయించుకోవాలి: జేటీసి పాండురంగనాయక్

రోడ్లపై తిరిగే ప్రతి వాహనానికి బీమా తప్పని సరిగా చేయించుకోవాలని ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాండురంగ నాయక్ అన్నారు.రవాణా వాహనాలు ప్రతి సంవత్సరం తప్పని సరిగా బీమా పునరుద్దరించుకోవాలని, బీమా పత్రాలు చూపిస్తేనే వాటికి సామర్థ పరీక్షలు నిర్వహించి దృవీకరణ పత్రాలు(ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు) ఇస్తారని తెలిపారు.వ్యక్తి గత వాహన యజమానులు బీమా విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీమా లేని ద్విచక్ర వాహనాలు నగరంలో ఎక్కువగా ఉన్నాయని వీటిపై ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

uninsured vehicles are 65 percent in Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బీమా లేని వాహనాలు 65 శాతం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: