ట్యాంక్ బండ్ లో గుర్తు తెలియని మృతదేహం

Suside

హైదరాబాద్: హుస్సెన్‌సాగర్ గాంధీనగర్ ఔట్‌పోస్టు సమీపంలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభించింది. స్థానికులు 5.6 అడుగుల ఎత్తు ఉన్న ఓ వ్యక్తి మృతదేహం నీటిపై తేలడంతో గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాడీని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాంగోపాల్‌పేట పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే 9951563904, 04027853595 నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.

Unidentified dead body Found in Hussain Sagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ట్యాంక్ బండ్ లో గుర్తు తెలియని మృతదేహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.