గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Unidentified body found in Palvancha

పాల్వంచ: పట్టణ పరిధి అయ్యప్పనగర్ సుగుణ గార్డెన్స్ వెనుక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సోమవారం ఉదయం సుగుణ గార్డెన్స్ వెనుక ప్రాంతంలో నీటి మడుగులో ఓ వ్యక్తి మృతి చెంది ఉండటాన్నిస్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్‌ఐ ముత్యం రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదని, మృతిని ఒంటిపై ప్యాంటు, గీతల చొక్కా ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. వయస్సు సుమారు 35 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చని పోలీసులు తెలిపారు. పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా  ఆసుపత్రకి తరలించారు.

Comments

comments