బ్రిటన్ వెళ్లే భారతీయ విద్యార్థులకు శుభవార్త

లండన్: భారతీయ విద్యార్థులకు బ్రిటిష్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విద్యార్థులు రెండేళ్ల పాటు అక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం చేపట్టేందుకు వీలు కల్పించే రెండేళ్ల పోష్ట స్టడీ వర్క్ వీసాను బోరిస్ జాన్సన్ ప్రభుత్వం బుధవారం పునరుద్ధరించింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇది అమలులోకి వస్తుంది. బ్రిటన్‌లోని విద్యాసంస్థలలో చేరదలచుకున్న విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత మరో రెండేళ్ల పాటు పోస్ట్ స్టడీ వీసా […] The post బ్రిటన్ వెళ్లే భారతీయ విద్యార్థులకు శుభవార్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: భారతీయ విద్యార్థులకు బ్రిటిష్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విద్యార్థులు రెండేళ్ల పాటు అక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం చేపట్టేందుకు వీలు కల్పించే రెండేళ్ల పోష్ట స్టడీ వర్క్ వీసాను బోరిస్ జాన్సన్ ప్రభుత్వం బుధవారం పునరుద్ధరించింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇది అమలులోకి వస్తుంది. బ్రిటన్‌లోని విద్యాసంస్థలలో చేరదలచుకున్న విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత మరో రెండేళ్ల పాటు పోస్ట్ స్టడీ వీసా ద్వారా అక్కడే కొనసాగవచ్చు. ఈ విధానాన్ని 2012లో రద్దు చేయడంతో ఉన్నత చదువుల నిమిత్తం బ్రిటన్‌కు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతంలో ఈ వీసా విధానం అమలులో ఉన్నపుడు తమ చదువు కోసం తీసుకున్న రుణాన్ని కొంతైనా తీర్చడానికి విద్యార్థులు ఈ రెండేళ్ల కాలాన్ని బ్రిటన్‌లో ఉద్యోగం చేయడానికి ఉపయోగించుకునేవారు. పోస్ట్ స్టడీ వీసా విధానం రద్దు చేయడంతో 2010-11 సంవత్సరంలో 39,090 ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2016-17 నాటికి 16,550కి పడిపోయింది. 2019 మార్చి ముగింపు నాటికి బ్రిటన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 21,165 ఉంది.

 

UK’s new visa offer to benefit thousands of Indian students, The announcement means that Indian and other international students who join a UK educational institution from the 2020-21 academic year and complete a degree course in any subject will be able to stay for two years and take up any job.

The post బ్రిటన్ వెళ్లే భారతీయ విద్యార్థులకు శుభవార్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: