మోడీకి యుఎఇ అత్యున్నత అవార్డు ప్రదానం

PM Modi

 

అబూ ధాబి: భారత ప్రధాని నరేంద్రమోడీ శనివారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ను స్వీకరించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందేందుకు ఆయన చేసిన ప్రయత్నాల్ని హర్షిస్తూ యుఎఇ ఈ అవార్డును ప్రదానం చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ రాణి ఎలిజెబెత్ @, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వంటి నాయకులు గతంలో ఈ అవార్డును అందుకున్నారు. ‘యుఎఇ వ్యవస్థాపకుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరుమీద ఈ అవార్డును నెలకొల్పారు.

ఈ ఏడాది మోడీకి ఈ అవార్డు ఇవ్వడంలో ఒక ప్రత్యేకత ఉంది. షేక్ జాయెద్ శత జయంతి సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేశారు’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆయన పర్యటనకు ముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన అనేక రంగాల్లో ఇండియాయుఎఎల మధ్య బహుముఖీనంగా సంబంధాలున్నాయి.2015లో మోడీ ఇక్కడ పర్యటించినప్పుడు అవి మరింత బలపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో యుఎఇ మోడీకి ఈ అవార్డును ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.

UAE honours PM Modi with highest civilian award

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మోడీకి యుఎఇ అత్యున్నత అవార్డు ప్రదానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.