రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకుల మృతి

రాజాపూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాలు ప్రకారం… మిడ్జిల్ మండలం దోనూరు గ్రామానికి చెందిన పాలది ప్రసాద్(31), పాలాటి వంశి ఇద్దరు స్నేహితులు హైదరాబాద్ నుంచి దోనూరు గ్రామానికి ఉదయం స్కూటి పై బయలుదేరారు. రాజాపూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపైకి రాగానే వెనుక నుంచి రాజస్తాన్‌కు చెందిన కంటైనర్ వాహనం బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరి […]

రాజాపూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాలు ప్రకారం… మిడ్జిల్ మండలం దోనూరు గ్రామానికి చెందిన పాలది ప్రసాద్(31), పాలాటి వంశి ఇద్దరు స్నేహితులు హైదరాబాద్ నుంచి దోనూరు గ్రామానికి ఉదయం స్కూటి పై బయలుదేరారు. రాజాపూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపైకి రాగానే వెనుక నుంచి రాజస్తాన్‌కు చెందిన కంటైనర్ వాహనం బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరి పై నుండి వాహనం టైర్ ఎక్కడంతో నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టంకు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతిడి ప్రసాద్ అన్న పాలాది పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు పోలీసులు తెలిపారు.

Related Stories: