బ్యాంక్‌ను ఛీటింగ్ చేసిన మేనేజర్‌కు రెండేళ్ల జైలు

  హైదరాబాద్: ఖాతాదారులకు పంపిన చెక్కులు తన సొంతానికి వాడుకుని మోసం చేసిన మాజీ బ్యాంక్ మేనేజర్‌కు రెండేళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. నగరంలోని నల్లకుంటకు చెందిన దూడల జ్యోతి ప్రసాద్ దిల్‌సుక్‌నగర్ ఎస్‌బిఐ మేనేజర్‌గా 2011 నుంచి 2013వరకు పనిచేసింది. ఈ క్రమంలో సత్యం కంప్యూటర్స్, మిగతా ఖాతాదారులకు పంపించిన సిటిఎస్ చెక్కులు ఖాతాదారులకు పంపించగా వారు అక్కడ లేకపోవడంతో బ్యాంక్‌కు తిరిగి వచ్చాయి. వాటిని […] The post బ్యాంక్‌ను ఛీటింగ్ చేసిన మేనేజర్‌కు రెండేళ్ల జైలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ఖాతాదారులకు పంపిన చెక్కులు తన సొంతానికి వాడుకుని మోసం చేసిన మాజీ బ్యాంక్ మేనేజర్‌కు రెండేళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. నగరంలోని నల్లకుంటకు చెందిన దూడల జ్యోతి ప్రసాద్ దిల్‌సుక్‌నగర్ ఎస్‌బిఐ మేనేజర్‌గా 2011 నుంచి 2013వరకు పనిచేసింది. ఈ క్రమంలో సత్యం కంప్యూటర్స్, మిగతా ఖాతాదారులకు పంపించిన సిటిఎస్ చెక్కులు ఖాతాదారులకు పంపించగా వారు అక్కడ లేకపోవడంతో బ్యాంక్‌కు తిరిగి వచ్చాయి. వాటిని బ్యాంక్ మేనేజర్ జ్యోతిప్రసాద్ బ్యాంక్ ఖాతాదారు చంద్రకళ ఖాతాలో చెక్కులు డిపాజిట్ చేసి రూ.21.51లక్షలు విత్‌డ్రా చేసుకున్నారు. ఎస్‌బిఐ రీజినల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు ఎస్సై కెఎస్ రత్నం దర్యాప్తు చేశారు. చార్జ్‌షీట్ కోర్టులో దాఖలు చేయగా కోర్టు రెండేళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధించారు.

Two years jailed to manager in bank fraud case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బ్యాంక్‌ను ఛీటింగ్ చేసిన మేనేజర్‌కు రెండేళ్ల జైలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: