ఇద్దరూ ఇద్దరే

      ఇంతవరకు మహిళ అడుగుపెట్టని రంగం లేదు. రోదసిలోకి ఒంటరిగా వెళ్లడం ఆమెకేం కొత్తకాదు. ఇంతవరకూ పురుషులతో కలిసి వెళ్లింది. ఇప్పుడు మహిళలు మాత్రమే బృందంగా వెళ్లబోతున్నారు. ఈ నెల 29న కేవలం మహిళా వ్యోమగాములతో అంతరిక్షయానం నిర్వహిస్తోంది నాసా. ఇలా ఒక మహిళాబృందం రోదసిలోకి వెళ్తుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్‌లో ఉన్న నాసా ఆస్ట్రోనాట్ అన్నె మెక్లెయిన్‌తో కలిసి క్రిస్టినా ఈ సాహసయాత్ర చేయనున్నారు. ఈ యాత్రను మహిళలే […]

 

 

 

ఇంతవరకు మహిళ అడుగుపెట్టని రంగం లేదు. రోదసిలోకి ఒంటరిగా వెళ్లడం ఆమెకేం కొత్తకాదు. ఇంతవరకూ పురుషులతో కలిసి వెళ్లింది. ఇప్పుడు మహిళలు మాత్రమే బృందంగా వెళ్లబోతున్నారు. ఈ నెల 29న కేవలం మహిళా వ్యోమగాములతో అంతరిక్షయానం నిర్వహిస్తోంది నాసా. ఇలా ఒక మహిళాబృందం రోదసిలోకి వెళ్తుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్‌లో ఉన్న నాసా ఆస్ట్రోనాట్ అన్నె మెక్లెయిన్‌తో కలిసి క్రిస్టినా ఈ సాహసయాత్ర చేయనున్నారు. ఈ యాత్రను మహిళలే పర్యవేక్షించడం మరో విశేషం. గతంలో 1984లో రష్యాకు చెందిన వ్యోమగామి స్వెట్లానా సావిట్‌స్కయా తొలిసారి ఒంటరిగా స్పేస్‌వాక్ చేసిన మహిళగా నిలవగా, ఇప్పుడు స్పేస్‌వాక్ మిషన్‌లో అందరూ మహిళలే ఉండటం ప్రత్యేకం. వీరిద్దరూ భూమి ఉపరితలానికి 400 కిలోమీటర్ల ఎత్తు వరకూ దూసుకెళ్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట స్పేస్ వాక్ చేస్తారు. రెండు స్టేషన్ల పవర్ ఛానల్స్‌ను నవీకరిస్తారు. రోదసిలో 7 గంటలు ఉంటారు.

అన్నె మెక్లెయిన్ 2013లో నాసా ఆస్ట్రోనాట్ బృంద సభ్యురాలిగా ఎంపికైంది. ఈమె వయసు 40 ఏళ్లు. అమెరికాలో పుట్టి పెరిగిన అన్నె మెకానికల్ ఇంజినీరింగ్ చదివింది. అమెరికా మిలటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకొని యూఎస్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు నిర్వహించింది. 2015లో నాసాలో శిక్షణ ముగించింది. అమెరికా ఆర్మీ మేజర్‌గా, అటాక్ హెలికాప్టర్ పైలెట్‌గా, ఏరోస్పేస్ ఇంజినీర్‌గా బాధ్యతలు సమర్థంగా నిర్వహించింది. గత డిసెంబరు నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో పనిచేస్తోంది.

అంటార్కిటిక్ రీసెర్చ్ స్టేషన్‌లో పని చేసిన క్రిస్టినాకు మైనస్ 105 డిగ్రీల ఉష్ణోగ్రతను ఎదుర్కొన్న అనుభవం ఉంది. 2015 జూన్‌లో ఆస్ట్రోనాట్ శిక్షణ ముగించింది. చిన్నప్పటి నుంచి వ్యోమగామి కావాలని బలంగా అనుకుంది. ఖగోళశాస్త్రంపై ఆసక్తి ఉంది. స్పేస్‌ఫ్లైట్‌లో ప్రయాణం అంటే ఓ ఛాలెంజ్. 40 ఏళ్ల వయసులో ఇప్పటికి నా కల నెరవేరినట్లు చెబుతోంది. నారీమణుల సాహసయాత్రకు సహకరిస్తున్న వారంతా కూడా మహిళలే. కెనెడా స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్లైట్ కంట్రోలర్ క్రిస్టెన్ ఫాసియల్, హోస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్ నుంచి పర్యవేక్షించనుండగా, మహిళా స్పేస్ వాకర్స్ లీడ్ ఫ్లైట్ డైరెక్టర్ మేరీ లారెన్స్, జాకీ కాగే తమ వంతు సహకారం అందిస్తున్నారు.

 

Two Women’s Enter into International Space Station
Two Women’s Enter into International Space Station

Related Images:

[See image gallery at manatelangana.news]