సాగర్ కాలువ విషాద సాగరం

Womans-Dies

కాల్వలో దూకిన కారు .. అత్త, కోడలు, గర్భస్థ్థ శిశువు దుర్మరణం
ఖమ్మం జిల్లా గొల్లగూడెం వద్ద దుర్ఘటన.. చనిపోయిన స్వాతికి ఆపరేషన్ చేసి చూడగా బయటపడిన మృత శిశువు

మన తెలంగాణ/ఖమ్మం రూరల్ :నిండు గర్భవతిని ఖమ్మం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా కారు నాగర్జునసాగర్ కా లువలో దూకి జరిగిన ఘోరప్రమాదంలో భర్త సురక్షితంగా బయటపడగా కారులోని ఆయన తల్లి, గర్భిణీ అయిన భార్య ఆమె గర్భంలోని శిశువు దుర్మరణం పాలైన దారుణం ఆ కాలువను విషాద సాగరం చేసింది. ఖమ్మం జిల్లా గొల్లగూడెం వద్ద కారు రివర్స్ చేస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. అత్త, గర్భిణి అయిన కోడలు మృతి చెందినప్పటికీ ఆమె బిడ్డ బతికున్నాడని భావించి వైద్యులు హుటాహుటిన శ్రస్త్ర చికిత్స చేశారు. వారి ప్రయత్నం ఫలించలేదు. రూరల్ ఎస్సై వెంకట్రావ్ తెలియజేసిన దాని ప్రకారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చిన్న గూడూరు గ్రామానికి చెందిన పోగుల మహిపాల్‌రెడ్డి భార్య స్వాతి(28) తొమ్మిది నెలల గిర్భిణీ.

మహిపాల్‌రెడ్డి తన తల్లి ఇందిర(48), భార్య ను తీసుకొని ఆదివారం ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. తిరుగుప్రయాణంలో గొల్లగూడెం వద్ద కారును రివర్స్ చేస్తుండగా సాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. మహిపాల్‌రెడ్డి కారులో నుంచి బయటికి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అత్తా కోడళ్లు ఇందిర, స్వాతి బయటకు రాలేక మునిగిపోయి చనిపోయారు. పోలీసులు స్థానికుల సాయంతో కారును బయటి కి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చనిపోయిన స్వాతి కడుపులో శిశువు ప్రాణాలతో ఉన్న ట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి బాబును బయటికి తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Two Woman Dies in Road Accident in Khammam Dist

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సాగర్ కాలువ విషాద సాగరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.