టైప్-1 డయాబెటిస్‌లో రెండు రకాలు

7-12 ఏళ్ల పిల్లల్లోని డయాబెటిస్‌లో తేడాలపై అధ్యయనం లండన్ : టైప్ 1 డయాబెటిస్ అంటే ఒకటి కాదు. రెండు వేర్వేరు పరిస్థితులతో ఇది కూడుకున్నదని పరిశోధకులు ధ్రువీకరించారు. ఏడేళ్ల లోపు పిల్లల్లో కనిపించే డయాబెటిస్‌కు , 13 ఏళ్లు దాటిని పిల్లల్లో కనిపించే డయాబెటిస్‌కు తేడా ఉందని పరిశోధకులు వివరించారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటెర్ పరిశోధకులు ఈ తేడాను గుర్తించారు. దీనివల్ల డయాబెటిక్ బాధితులను నయం చేయడానికి సరైన మార్గం దొరుకుతుందని ఆశాభావం […] The post టైప్-1 డయాబెటిస్‌లో రెండు రకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
7-12 ఏళ్ల పిల్లల్లోని డయాబెటిస్‌లో తేడాలపై అధ్యయనం

లండన్ : టైప్ 1 డయాబెటిస్ అంటే ఒకటి కాదు. రెండు వేర్వేరు పరిస్థితులతో ఇది కూడుకున్నదని పరిశోధకులు ధ్రువీకరించారు. ఏడేళ్ల లోపు పిల్లల్లో కనిపించే డయాబెటిస్‌కు , 13 ఏళ్లు దాటిని పిల్లల్లో కనిపించే డయాబెటిస్‌కు తేడా ఉందని పరిశోధకులు వివరించారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటెర్ పరిశోధకులు ఈ తేడాను గుర్తించారు. దీనివల్ల డయాబెటిక్ బాధితులను నయం చేయడానికి సరైన మార్గం దొరుకుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. శరీరం లోని రోగ నిరోధక శక్తి ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేసేటప్పుడు వాటిని నాశనం చేసేటప్పుడు టైప్1 డయాబెటిస్ సంక్రమిస్తుంది. క్లోమం నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.

ఈ పరిస్థితికి అర్థం రక్తం లోని చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో ఉండవు అని చెప్పవచ్చు. ఇది వస్తే ఆయా వ్యక్తులు రోజూ అనేకసార్లు ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా శరీరంలో చేర్చుకోవలసి వస్తుంది. డయాబెటోలాజియా జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనంలో కొత్తగా తేలిన అంశం డయాబెటిస్ సోకిన ఏడేళ్ల లోపు పిల్లల్లో ఇన్సులిన్ స్థాయిలు సరిగ్గా ఉండబోవని మొట్టమొదటి సారి బయటపడడం విశేషం. ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే కణాలు నాశనం కావడమే దీనికి కారణం. నిద్రావస్థలో ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి కణాలు సమర్థంగా పనిచేసేలా చూడాలన్నదే ఈ పరిశోధనలో ప్రాధాన్యం సంతరించుకున్నది. టైప్1 డయాబెటిస్‌లో రెండు రకాలకు పరిశోధకులు ఎండోటైప్ 1( టి1డిఇ1), ఎండోటైప్ 2 (టి1డిఇ 2 ) అని పేర్లు పెట్టారు.

టైప్1 డయాబెటిస్ ఎండోటైప్ 1ఏడేళ్ల లోపు చిన్నపిల్లలకు, టైప్1 డయాబెటిస్ 2 ఏడేళ్లు దాటిన పిల్లలకు సంక్రమిస్తుందని వివరించారు. ఈ విధంగా రెండు వేర్వేరు పరిస్థితులు టైప్ 1డయాబెటిస్‌లో కనిపించడం ఆశ్చర్యం కలిగించిందని ప్రొఫెసర్ నోయెల్ మోర్గాన్ వివరించారు. ఈ వ్యాధి సంక్రమించడానికి ఎటువంటి కారణాలు దోహదం చేస్తాయో తెలుసుకోడానికి, భవిష్యత్తులో ఈ పిల్లలను నయం చేయడానికి ఈ పరిశోధన దారి చూపుతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా నిద్రావస్థలో ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి కణాలను చైతన్యవంతం చేసే ప్రక్రియలు అనునరించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు.

వయోవృద్ధుల్లో ఎవరికైనా ఇన్సులిన్ లోపిస్తే ఈ ప్రక్రియ ద్వారా చికిత్స చేయడానికి వీలవుతుందన్నారు. ఏడు పన్నెండు సంవత్సరాల మధ్యనున్న పిల్లల్లో డయాబెటిస్ కనిపిస్తే టైడ్ 1 లేదా టైడ్ 2 గ్రూప్ డయాబెటిస్ ఉంటుందని పేర్కొన్నారు. టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్టు గుర్తించిన పిల్లలు మృత్యువాత పడడంతో పరిశోధకుల బృందం 130 నమూనాలను సేకరించి అధ్యయనం చేపట్టింది. టైప్ 1డయాబెటిస్ గుర్తించిన వారి లో వయస్సు పెరుగుతున్నకొద్దీ క్లోమం (పాంక్రియాస్) లో తేడాలు రావడం రక్తంలో గమనించారు.

Two types of type 1 diabetes

The post టైప్-1 డయాబెటిస్‌లో రెండు రకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: