టివిఎస్- బస్సు ఢీ : ఇద్దరు మృతి

  చిట్యాల : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా… మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన  నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన పిల్లి సంజీవ కుమారుని వివాహం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని విజిఎస్ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. ఈ వివాహవేడుకకు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డి గూడెం గ్రామానికి చెందిన గ్యార నరసింహ (55), చౌటుప్పల్ […] The post టివిఎస్- బస్సు ఢీ : ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చిట్యాల : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా… మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన  నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన పిల్లి సంజీవ కుమారుని వివాహం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని విజిఎస్ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. ఈ వివాహవేడుకకు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డి గూడెం గ్రామానికి చెందిన గ్యార నరసింహ (55), చౌటుప్పల్ మండలం మాల్కాపురం గ్రామానికి చెందిన ఊదరి భిక్షపతి (50), రామన్నపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బల్ల ఆనంద్‌లు హాజరయ్యారు.

పెళ్లి వేడుకలో కలిసిన ఈ ముగ్గురు తమ టివిఎస్ వాహనంపై ఫంక్షన్ హాల్‌కు వెళ్లే క్రమంలో రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా కొత్తగూడెం ఆర్‌టిసి డిపో సూపర్ లగ్జరీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వాహనంపై ఉన్న గ్యారా నరసింహ, ఊదరి భిక్షపతిలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. బల్ల ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కామినేని దవాఖానకు తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాములు తెలిపారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్‌పి రంగనాధ్, డిఎస్‌పి వెంకటేశ్వర్‌డ్డిలు సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు పరిశీలించి, రోడ్డు ప్రమాదాలు జరుగకుండా జంక్షన్ల వద్ద సరైన ప్రమాద నివారణ సూచికలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Two people killed in TVS Bus accident in Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టివిఎస్- బస్సు ఢీ : ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: