జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు మృతి

soldiers

 

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దాళాలు మట్టుబెట్టారు. మంగళవారం సౌత్ కాశ్మీర్, త్రాల్ ప్రాంతంలోని ఝండ్ గ్రామంలో ఉగ్రవాదులు ఓ ఇంటిలో దాగి ఉన్నారని సమచారం అందడంతో సిఆర్ పిఎఫ్, ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో అప్రమత్తమైన భద్రతా దాళాలు ఉగ్రవాదులపై ఎదరు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా.. ఇద్దరు సైనికులు గాయపడ్డారని జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా, సోమవారం సోఫియన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను హతమయ్యారు.

Two Militants Killed in South Kashmir Encounter

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.