లారీని ఢీకొట్టిన కారు…

మన తెలంగాణ/నందిగామ: లారీ కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణ, భార్య అలేఖ్య, కుమారుడు ఆసిల్ ఓ కారును కిరాయి తీసుకొని బెంగూళూరులో తన అత్త ఆరోగ్యం బాగా లేనందున కొండాపూర్ నుండి శుక్రవారం సుమారు 5.30 గంటలకు బయలుదేరారు. మార్గమధ్యలో నందిగామ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఎమ్‌ఎస్‌ఎస్ […] The post లారీని ఢీకొట్టిన కారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/నందిగామ: లారీ కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణ, భార్య అలేఖ్య, కుమారుడు ఆసిల్ ఓ కారును కిరాయి తీసుకొని బెంగూళూరులో తన అత్త ఆరోగ్యం బాగా లేనందున కొండాపూర్ నుండి శుక్రవారం సుమారు 5.30 గంటలకు బయలుదేరారు. మార్గమధ్యలో నందిగామ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఎమ్‌ఎస్‌ఎస్ పరిశ్రమ ముందుకు రాగానే కారు డ్రైవర్ తన కారును అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడుపుతూ ముందున్న లారీని ఢీకొనగా కారులో ప్రయాణిస్తున్న భార అలేఖ్య, కుమారుడు ఆసిల్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన వారిని షాద్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు డ్రైవర్ సయ్యద్ ఇసాక్ పై కేసు నమాదు చేసుకొని ఎస్సై వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Two members injured in Car Collided to Lorry

 

Two members injured in Car Collided to Lorry

The post లారీని ఢీకొట్టిన కారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: