కల్తీకల్లు తాగి ఇద్దరు దుర్మరణం…

  మొయినాబాద్ : కల్తీ కల్లుతాగి వాంతులు, విరోచనాలతో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన రంగారెడ్డి జిల్లా , మొయినాబాద్ మండలం పరిధిలోని ఎత్‌బార్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మొయినాబాద్ సిఐ వెంకటేశ్వర్లు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రచారం గుండాల చంద్ర య్య (60), గుండాల సాలమ్మ (58), గుండాల లక్షమ్మలు శుక్రవారం రాత్రి చేవెళ్ళ మండలం కందవాడ గ్రామంలోని కల్లు దుకాణం నుంచి కల్లును కొనుగోలు చేసి […] The post కల్తీకల్లు తాగి ఇద్దరు దుర్మరణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మొయినాబాద్ : కల్తీ కల్లుతాగి వాంతులు, విరోచనాలతో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన రంగారెడ్డి జిల్లా , మొయినాబాద్ మండలం పరిధిలోని ఎత్‌బార్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మొయినాబాద్ సిఐ వెంకటేశ్వర్లు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రచారం గుండాల చంద్ర య్య (60), గుండాల సాలమ్మ (58), గుండాల లక్షమ్మలు శుక్రవారం రాత్రి చేవెళ్ళ మండలం కందవాడ గ్రామంలోని కల్లు దుకాణం నుంచి కల్లును కొనుగోలు చేసి ఎత్‌బార్‌పల్లి గ్రామంలో చికెన్ వండుకొని కల్లుతాగి, తిని పడుకున్నారు.

అయితే చంద్రయ్య, సాలమ్మ రాత్రి 11 గంటలకు లేచి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అప్పటికే రాత్రి వర్షం కురుస్తుండటంతో ఉదయం ఆసుపత్రికి వెళ్దామని అనుకొని పడుకున్నారు. శనివారం ఉదయం తెల్లవారు జామున ఇంకా నిద్రలోంచి లేవకపోవడంతో గుర్తించిన చంద్రయ్య కుమారుడు నిద్రలోంచి లేపేందుకు ప్రయత్నించగా చంద్రయ్య అప్పటికే మరణించినట్లు గుర్తించాడు. సాలమ్మ తీవ్ర అస్వస్థత కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీనిని గమనించిన కుమారుడు వెంటనే సాలమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాలమ్మ కూడా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వారితో పాటు కల్లు సేవించిన లక్ష్మమ్మ అనే మహి ళ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

Two members dies with drinking adulterated palm wine

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కల్తీకల్లు తాగి ఇద్దరు దుర్మరణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: