బైక్ ను ఢీకొట్టిన లారీ: ఇద్దరు యువకుల మృతి

  మన తెలంగాణ / బాలానగర్:  ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయత్నిస్తున్నారు. తాము ఉద్యోగం అన్వేషించేందుకు శంషాబాద్ వెళ్తామని తమ ఇంట్లో చెప్పి ఆ స్నేహితులు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరారు. ఇంతలోనే మృత్యువు వారిని ఓ లారీ రూపంలో వచ్చి కబలించింది. వారి నిండు నూరేళ్ల జీవితం అర్థాంతరంగా ఆగిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.  జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బండారి యాదగిరి (23), పోలేపల్లి భరత్‌కుమార్ […] The post బైక్ ను ఢీకొట్టిన లారీ: ఇద్దరు యువకుల మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ / బాలానగర్:  ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయత్నిస్తున్నారు. తాము ఉద్యోగం అన్వేషించేందుకు శంషాబాద్ వెళ్తామని తమ ఇంట్లో చెప్పి ఆ స్నేహితులు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరారు. ఇంతలోనే మృత్యువు వారిని ఓ లారీ రూపంలో వచ్చి కబలించింది. వారి నిండు నూరేళ్ల జీవితం అర్థాంతరంగా ఆగిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.  జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బండారి యాదగిరి (23), పోలేపల్లి భరత్‌కుమార్ (22)లు శుక్రవారం ఉద్యోగం కోసమని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు తమ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కేరళ రాష్ట్రానికి చెందిన లారీ జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్తుండగా మండల సమీపంలోని పెద్దాయపల్లి చౌరస్తా దగ్గర ఆ లారీ వెనకభాగం ఒక్కసారిగా వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు తునాతునకలయ్యారు. తమ శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సంఘటనను చూసిన స్థానికులు తీవ్రంగా కలతచెందారు. స్థానిక పోలీసులు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. భరత్‌కుమార్ తండ్రి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ శ్రీనివాస్‌ రావు పేర్కొన్నారు.

The post బైక్ ను ఢీకొట్టిన లారీ: ఇద్దరు యువకుల మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: