కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

Two killed three injured after three vehicles

మండీ: భారీవర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. మండీలోని  కుల్లూ మార్గంలో నిత్యావసరాలు, కూరగాయలు తీసుకువెళ్తుండగా కొండచరియలు విరిగిపడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన హనోజీ దేవాలయం దగ్గర శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దేవాలయం సమీపంలో వాహనాలు నిలిపిఉంచిన సమయంలో కొండచరియలు విరిగి పడి ప్రమాదం సంభవించినట్టు మండీ జిల్లా ఎస్పీ చాంద్ శర్మ తెలిపారు. భారీ వరదల కారణంగా పాగల్ నాలా పొంగి పోర్లుతుండటంతో కుల్లూ జిల్లా రాష్ట్ర రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని చాంద్ శర్మ పేర్కొన్నారు.

Two killed three injured after three vehicles

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.