అమెరికాలో ట్రక్కు ఢీకొని ఇద్దరు భారతీయులు మృతి

Students Killed

 

వాషింగ్టన్ : అమెరికాలో ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. ఈ హిట్ అండ్ రన్ కేసులో మృతి చెందిన ఒక విద్యార్థి వైభవ్ గోపిశెట్టి (26) తెలుగువాడుగా గుర్తించారు. టెన్సీసీ రాష్ట్రంలోని సౌత్ నాష్‌విల్లీలో గత నెల 28వ తేదీ రాత్రి ఈ హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. మృతి చెందిన మరోకరిని భారతీయ విద్యార్థిని జూడీ స్టేన్లీ (23)గా గుర్తించారు. థ్యాంక్స్‌గివింగ్ రోజున రాత్రిపూట వీరిని ఒక వ్యాన్ ఢీకొని దూసుకువెళ్లింది. తరువాత డ్రైవర్ తమకు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు విద్యార్థులు టెన్నీస్సీ స్టేట్ యూనివర్శిటీ (టిఎస్‌యు)లో ఫుడ్ సైన్స్ డిగ్రీ చదువుతున్నారు. విద్యార్థుల మృతిపట్ల విద్యాలయం అధికారికంగా సంతాప ప్రకటన వెలువరించింది. గాలింపు చర్యలకు ముందుగానే 26 ఏండ్ల డ్రైవర్ డేవిడ్ టోరీస్ తమ ముందుకు వచ్చి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Two Indian students killed in hit and run crash in US

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమెరికాలో ట్రక్కు ఢీకొని ఇద్దరు భారతీయులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.