ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో ఇద్దరు భారతీయ వ్యాపారవేత్తలు

Two Indian businessmen

 

న్యూయార్క్: ఫార్చ్యూన్ 40 అండర్ 40 గ్లోబల్ జాబితాలో భారతీయ సంతతికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు అర్జున్ బన్సాల్ (35), అంకిత్ బోస్ (27) చోటు దక్కించుకున్నారు. అర్జున్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ఇంటెల్ వైస్ ప్రెసిడెంట్, అలాగే అంకితి ఫ్యాషన్ ప్లాట్‌ఫాం జిలింగో సిఇఒ, సహ వ్యవస్థాపకురాలు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రతి ఏడాది ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 40 మంది యువకుల జాబితాను విడుదల చేస్తుంది. ఫార్చ్యూన్ ప్రకారం, అమెరికా, ఇజ్రాయెల్, పోలాండ్లలో ఇంటెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)లో అర్జున్ బృందంలో 100 మంది ఉన్నారు. ఇంటెల్ ప్రధాన ఎఐ ప్రాజెక్టులలో అర్జున్ స్టార్టప్ నెర్వానా రూపొందించిన ప్రత్యేక కంప్యూటర్ చిప్ కూడా ఉంది. అంకితి నాలుగేళ్ల క్రితం జిలింగోను ప్రారంభించారు. ఆగ్నేయాసియాలోని చిన్న వ్యాపారాలకు తమ ఉత్పత్తులను విక్రయించడానికి జిలింగో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను అందిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది.

Two Indian businessmen in Fortune 40 Under 40 list

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో ఇద్దరు భారతీయ వ్యాపారవేత్తలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.