పెళ్లిలో ఢీజె

Dj fight
ఊరేగింపుపై పెళ్లి కుమారుడు, కుమార్తె బంధువుల మధ్య వాగ్వాదం, చితగ్గొట్టుకున్న ఇరువర్గాలు

మనతెలంగాణ/ కోదాడ రూరల్ : పెళ్లింట్లో డిజె పాటల విషయంలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణస్వామి తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో నివాసముండే అజయ్‌తో ఇందిర అనే యువతికి వివాహం జరిగింది. పెళ్లి అనంతరం బరాత్ విషయంలో వాగ్వాదం తలెత్తింది. ఆ తర్వాత డిజె పాటలతో, ఆటలతో దంపతులనిద్దరినీ ఊరేగింపుగా ఊరి చివరి వరకు సాగనంపాలని పెళ్ళి కుమారుడి బంధువులు పట్టు పట్టగా, తమ ఊరు చాలా దూరమని ఇప్పటికే ఆలస్యమైందని పెళ్ళి కుమార్తె బంధువులు వారించడం మొదలుపెట్టారు. అది కాస్తా ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల బంధువులు కర్రలతో కుర్చీలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Two families fight during wedding function in Suryapet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పెళ్లిలో ఢీజె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.