నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Road-Accidentనల్లగొండ: చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదఘటనలో ఇద్దరు యువకులు  అక్కడికక్కడే  మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారని బాధితులు తెలిపారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Two died in road accident at Nalgonda

The post నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.