రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…

Accidentరంగారెడ్డి: శంషాబాద్ మండలం సాతంరాయి దగ్గర గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న డిసిఎంను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే సమీప దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

Two Dead Three Injured in Road Accident At Shamshabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.