బైక్-కంటైనర్‌ ఢీ: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: బైక్ ను కంటైనర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌లో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. రాజాపూర్‌ వంతెన వద్ద వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతులను మిడ్జిల్‌ మండలం దోనూరు వాసులుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం […]

మహబూబ్‌నగర్‌: బైక్ ను కంటైనర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌లో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. రాజాపూర్‌ వంతెన వద్ద వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతులను మిడ్జిల్‌ మండలం దోనూరు వాసులుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Comments

comments

Related Stories: